సూపర్ స్టార్ మహేష్ కథానాయకుడిగా కొరటాల శివ శ్రీమంతుడు చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టీజర్, పాటలు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది. ధనవంతులు ఊరిని దత్తత తీసుకుని బాగు చేయడం అనేది కాన్సెప్ట్. బాగానే ఉంది.
అయితే పల్లెటూరిని దత్తత తీసుకుని బాగు చేసేద్దామనుకుంటే అంత వీజీనా. అక్కడ మంచి పని చేయాలన్నా చాలా గట్సుండాలి. బోలెడన్ని రాజకీయాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచికి పోతే చెడు ఎదురైన చందంగా ఉంటుంది పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ఓ శ్రీమంతుడు ఎలా గెలిచాడు? తనకి అన్నీ ఇచ్చిన ఊరిని ఎలా తీర్చిదిద్దాడు? అన్నదే కథాంశం. ఊరన్నాక లవరుంటుంది. స్నేహితులు ఉంటారు. రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు. ఇన్నిటిని ఎదుర్కోవాలంటే అందుకు తగ్గ ఖలేజా కూడా ఉండాలి. అది మహేష్ కి ఉందని చూపిస్తున్నాడు కొరటాల.
అసలు ఈ కాన్సెప్టు చూస్తుంటే నరేంద్ర మోదీ 'ఊరు -దత్తత' పథకమే ఇన్‌స్పిరేషన్ అనిపిస్తోంది. అందుకే నిర్మాతలు ఓ ప్లాన్ చేశారు. ఇలాంటి సినిమాని ప్రధాని మోడీ కి చూపిస్తే ఎంతో సంతోషిస్తారు. అలాగే విజ్ఞానదాయకమైన కమర్షియల్ సినిమా కాబట్టి మన ముఖ్య మంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరికీ ప్రత్యేకంగా ఓ ప్రివ్యూ షో వేయాలనుకుంటున్నారట. ఐడియా బాగానే ఉంది. ఆ ముగ్గురు నేతల్ని కూడా శ్రీమంతుడు దత్తత తీసుకునేట్టే కనిపిస్తున్నాడు!