శ్రీను వైట్ల కెరీర్ ఆరంభంలో తీసిన సినిమాలకు.. ఆ తర్వాత అతను రూపొందించిన చిత్రాలకు పొంతనే ఉండదు. ‘నీకోసం’ లాంటి ఫీల్ ఉన్న సీరియస్ లవ్ స్టోరీతో దర్శకుడిగా పరిచయమయ్యాడతను. ఆ తర్వాత ‘ఆనందం’ లాంటి మరో మంచి ప్రేమకథ తీశాడు. ఆపై ‘సొంతం’ కూడా లవ్ స్టోరీయే. కానీ ‘అందరివాడు’ దగ్గర్నుంచి రూటు మార్చాడు. ‘ఢీ’తో తనకంటూ ఒక బ్రాండ్ నేమ్ సంపాదించుకుని.. కొత్త ట్రెండ్ సృష్టించాడు. ‘దూకుడు’ దగ్గరికి వచ్చేసరికి కామెడీకి యాక్షన్ కూడా జోడించాడు. ఐతే ఓ దశ దాటాక తన సినిమాల్ని తనే కాపీ కొట్టి జనాలకు మొహం మొత్తేలా చేశాడు. అసలిప్పుడు తెలుగులో శ్రీను వైట్ల బ్రాండ్ సినిమాలంటేనే జనాలకు చిరాకొచ్చేసే పరిస్థితి నెలకొంది.
ఓవైపు వైట్ల సినిమాలంటే జనాలకు మొహం మొత్తేసింది. పైగా ఇంతకుముందులా రొటీన్ సినిమాల్ని జనాలు ఎంతమాత్రం ఆదరించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో వైట్ల కచ్చితంగా మార్పు చూపించక తప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో అతడి నుంచి వస్తున్న ‘మిస్టర్’ సినిమా టీజర్ చూస్తే ఇది అసలు వైట్ల సినిమానేనా అని ఆశ్చర్యపోయేలా ఉంది. పుష్కరం కిందట కెరీర్ ఆరంభంలో మాదిరి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ ట్రై చేసినట్లున్నాడు వైట్ల. కాకపోతే అప్పట్లో అతను లో బడ్జెట్లో.. లోకల్ లొకేషన్లలో సినిమాలు తీశాడు. ఈసారి భారీ బడ్జెట్లో.. రిచ్ లొకేషన్లలో సినిమా తెరకెక్కించినట్లున్నాడు. గత దశాబ్దం కాలంలో వైట్ల తీసిన ఏ సినిమా ఛాయలూ టీజర్లో కనిపించలేదు. టీజర్ మొత్తం హీరో హీరోయిన్ల చుట్టూనే తిరిగింది. వైట్ల మార్కు కామెడీ.. పంచ్ లకూ టీజర్లో చోటు లేదు. మొత్తానికి వైట్ల నుంచి ఈ సమయంలో ఇలాంటి సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు. టీజర్లో చూపించిన మార్పు.. సినిమాలోనూ చూపిస్తే తన కెరీర్ ను వైట్ల మళ్లీ కొత్త ట్రాక్ ఎక్కించినట్లే.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/