వెంకీ మీద వైట్ల సెటైర్లు?

Update: 2017-04-06 11:18 GMT
సెటైరికల్ కామెడీకి పెట్టింది పేరు శ్రీను వైట్ల. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు మొహమాట పడడు. ఎవరి మీదైనా సెటైర్లు వేయడానికి వెనుకాడడు. వైట్ల సినిమాలు చాలా వాటిలో ఇండస్ట్రీ ప్రముఖుల మీద సెటైరికల్ చూడొచ్చు. ‘దుబాయ్ శీను’లో సూపర్ స్టార్ కృష్ణను పోలిన పాత్రను ఎమ్మెస్ నారాయణతో చేయించి బోలెడన్ని నవ్వులు పంచిన వైట్ల.. ‘కింగ్’ సినిమాలో జయసూర్య పాత్ర మ్యూజిక్ డైరెక్టర్ చక్రిని ఉద్దేశించి పెట్టాడన్న అభిప్రాయాలు వినిపించాయి. అలాగే నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్.. ప్రకాష్ రాజ్ ల మీద కూడా సెటైర్లు వేయడానికి వెనుకాడలేదు వైట్ల. తాజాగా అతను విక్టరీ వెంకటేష్ ను టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

వైట్ల కొత్త సినిమా ‘మిస్టర్’లో స్టార్ కమెడియన్ పృథ్వీ చేస్తున్న పాత్ర వెంకీని ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పృథ్వీ చేస్తున్న పాత్ర పేరు.. ‘లక్ష్మీ తులసి’ కావడం విశేషం. ఈ రెండూ వెంకీ సినిమాల పేర్లన్న సంగతి తెలిసిందే. అమ్మాయిల పేర్లను టైటిళ్లుగా పెట్టుకుని హిట్టు కొట్టడం వెంకీకి సెంటిమెంటు. పృథ్వీ పాత్రకు ఈ టైటిల్ పెట్టాడంటే వైట్ల వెంకీ మీద సెటైర్లు గుప్పిస్తాడేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఐతే వెంకీతో వైట్ల స్వయంగా ‘నమో వెంకటేశ’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. మరి తాను పని చేసిన హీరో మీద వెంకీ సెటైర్లు వేయడానికి రెడీ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అసలే వైట్లకు ఈ మధ్య రోజులు బాగా లేవు. అతడు సంకట స్థితిలో ఉన్నాడు. ఈ టైంలో ఇలాంటి సెటైరికల్ కామెడీ అవసరమా అన్నది సందేహం. ఆ కామెడీ సరదాగా సాగితే ఓకే కానీ.. శ్రుతి మించితే మాత్రం వైట్లకు ఇబ్బందులు తప్పవు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News