మ్యాచోస్టార్ గోపీచంద్ -శ్రీవాస్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'లక్ష్యం'..'లౌక్యం'తో రెండు బ్లాక్ బాస్టర్లు అందుకున్నారు. రెండు చిత్రాలు కమర్శియల్ గా పెద్ద సక్సెస్ సాధించాయి. గోపీచంద్ కెరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. 'లక్ష్యం' శ్రీవాస్ కి దర్శకుడిగా తొలి సినిమా కాగా..అప్పటికే రెండు ప్లాప్ ల్లో ఉన్న గోపీచంద్ కి ఆ సినిమా సక్సెస్ ఊరటనిచ్చింది.
ఆ నమ్మకంతోనే మళ్లీ ఏడేళ్లు గ్యాప్ తర్వాత శ్రీవాస్ ఫెయిల్యూర్స్ లో ఉన్నా 'లౌక్యం' కి ఆఫర్ చేసాడు. అదీ పెద్ద సక్సెస్ అయింది. అలా ఇద్దరి కాంబినేషన్ విజయవంతమైంది. ఇప్పుడీ ద్వయం హ్యాట్రిక్ పై కన్నేసింది. ఇటీవలే పక్కా కమర్శయిల్ సినిమా ప్రమోషన్ లో పాల్గొంటున్న గోపీచంద్ శ్రీవాస్ ప్రాజెక్ట్ ని కన్పమ్ చేసిన సంగతి తెలిసిందే.
పక్కా కమర్శియల్ రిలీజ్ కాగానే అతని సినిమానే సెట్స్ కి వెళ్లనుంది. ఇది పక్కా కమర్శియల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. గోపీ చంద్ మాస్ ఇమేజ్ కి ..శ్రీవాస్ కామెడీ టైమింగ్ ని మ్యాచ్ చేస్తూ రాసుకున్న కథలా లీకులందుతున్నాయి. అయితే కొత్తదనం లేనిదే పాత కంటెంట్ తో మెప్పిద్దామంటే కుదరదు. సినిమాలో ఏదో ఒక కొత్త పాయింట్ తప్పనిసరి.
అలాంటి ఓ కాంప్లిక్ పాయింట్ తోనే కథని సిద్దం చేసినట్లు సమాచారం. అయితే శ్రీవాస్ స్ర్కిప్ట్ ని ఇంకా మరింత షార్ప్ గా తీర్చిదిద్దే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ శ్రీవాస్ కి ఎంతో కీలకం. ఇప్పటికే సరైన విజయాలు లేక ఛాన్సులకు దూరమవుతున్నాడు. గోపీచంద్ ఇప్పుడు నమ్మి అవకాశం ఇచ్చారు. ఇప్పుడా నమ్మకాన్ని శ్రీవాస్ నిలబెట్టాలి.
తాను సక్సెస్ అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే స్ర్కిప్ట్ కి సంబంధించి కొంత మంది సీనియర్ రైటర్ల సూచనలు..సలహాలు సైతం తీసుకుంటున్నట్లు సమాచారం. 'లక్ష్యం'..'లౌఖ్యం' సినిమాలకు రచయిత గోపీ మోహన్-కోన వెంటకట్ కూడా పనిచేసారు. ఇద్దరు స్ర్కీన్ ప్లే విభాగంలో భాగమయ్యారు.
అలా ఆ రెండు సినిమాల సక్సెస్ వెనుక ఆద్వయం ఉంది. మరి ఈసారి ఆ ఇద్దర్ని భాగస్వామ్యం చేస్తున్నాడా? కొత్త వారితో శ్రీవాస్ ముందుకెళ్తున్నాడా? అన్నది క్లారిటీ లేదు గానీ....స్ర్కిప్ట్ ని మాత్రం చెక్కే పనిలో ఉన్నాడు అన్నది వాస్తవంగా తెలుస్తోంది.