బాహుబ‌లి2లో జ‌క్క‌న్న కొడుకు తీసిన సీన్లు ఏవి?

Update: 2017-04-28 08:12 GMT
తెలుగు.. త‌మిళం.. మ‌ల‌యాళం.. క‌న్న‌డ‌.. హిందీ.. ఆ మాట‌కు వ‌స్తే.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా.. బాహుబ‌లి 2 చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజును బాహుబ‌లి 2 డేగా చెప్పినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదేమో. ఈ క్రేజీ సినిమాతో ప్ర‌త్య‌క్షంగానూ.. ప‌రోక్షంగానూ సంబంధం ఉన్న ప్ర‌తిఒక్క‌రిని మీడియా క‌వ‌ర్ చేస్తోంది. ఇక‌.. బాహుబ‌లి 2 ఇప్పుడు సోష‌ల్ మీడియా ట్రెండింగ్‌ గా మారింది. ఇలాంటి వేళ‌.. బాహుబ‌లి 2 ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి కుమారుడు కార్తికేయ ఒక మీడియా సంస్థ‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ చిత్రంలో త‌న రోల్ ఏమిట‌న్న విష‌యంతో పాటు.. తానేం సీన్లు తీశాన‌న్న ఆస‌క్తిక‌ర విశేషాల్ని చెప్పుకొచ్చారు.

* మొద‌టి భాగం విడుద‌లైన‌ప్పుడు.. మొద‌టి రెండు రోజులు నెగిటివ్ టాక్ రావ‌టంతో అంతా అయిపోయింది.. సెకండ్ పార్ట్ తీస్తామో లేదోన‌న్న గంద‌ర‌గోళంలో ప‌డ్డాం. కానీ.. అద్భుతం జ‌రిగిన‌ట్లుగా.. సినిమా పెద్ద హిట్ అయ్యింది. రెండో భాగం గురించి ఎలాంటి భ‌యం లేదు. నిజానికి ఫ‌స్ట్ పార్ట్‌లో అంతా పాత్ర‌ల ప‌రిచ‌య‌మే. సెకండ్ పార్ట్‌లోనే అస‌లు విష‌య‌మంతా.

* రెండో పార్ట్‌ లో వార్ సీన్లే ఎక్కువ‌గా తీశా. డ్రామా చాలా త‌క్కువ‌. రానాతో కొన్ని డ్రామా సీన్ల‌ను తీశా. డ్రామా సీన్ల‌లో భావోద్వేగాలు ఎక్కువ‌గా ఉంటాయి. వాటిని తీయ‌టం చాలా క‌ష్టం. అలాంటి వాటిని నాకిచ్చినా నేను తీయ‌న‌ని చెబుతా.

* బాహుబ‌లికి సంబంధించిన ఏర్పాట్లు స‌రిగా చేయ‌పోతే తిట్లు మామూలే. చిన్న‌ప్ప‌టి నుంచి తిట్లు అల‌వాటే. తిడితే ఫీల‌య్యే ర‌కం కాదు. స్కూల్లో టీచ‌ర్ తిట్లు.. ఇంట్లో అమ్మ తిట్లు. ఎన్ని తిట్లు ప‌డితే అంత బాగా ఎక్కుతుంద‌న్న‌ట్లుగా ఉండేది.

* ఛ‌త్ర‌ప‌తి మూవీ టైంకి ఎనిమిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నా. అప్ప‌ట్లో ఇంటి కింద‌నే ఎడిటింగ్ రూం ఉండేది. అక్క‌డికి వెళ్లి కూర్చునేవాడ్ని. నేను న‌స‌పెడితే.. ర‌వి అనే ఎడిటింగ్ అసిస్టెంట్ ఎడిటింగ్ నేర్పించాడు. మొద‌టిసారి ఛ‌త్ర‌ప‌తికి 30 సెక‌న్స్ ఎడిట్ చేశా. నాన్న చూసి బాగుంద‌న్నారు. అప్ప‌ట్లో చాలా చేసేశాన‌నిపించింది. మొద‌ట్నించి ఎడిటింగ్ అంటే ఇష్టంగా ఉండేది.

* ఈగ మూవీ స్టార్ట్ అయ్యాక అమ్మ ద‌గ్గ‌ర వ‌డ్డీకి డ‌బ్బులు తీసుకొని కెమేరా కొనుక్కొని ఈగ మేకింగ్ వీడియోలు స్టార్ట్ చేశా. త‌ర్వాత నాలుగైదు సినిమాల‌కు చేసి.. నాలుగు కెమేరాలు కొని ఒక టీం ఏర్పాటు చేశా. కీర‌వాణి బాబాయ్ మా బృందానికి షోయింగ్ బిజినెస్ అని పేరు పెట్టారు.

* ద‌ర్శ‌కుడ్ని కావాల‌నుకునేవాడ్ని. మ‌ర్యాద రామ‌న్న సినిమా అయిపోయాక ఈగకు డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్లో చేద్దామ‌నుకున్నా. అమ్మ వ‌ద్దంది. ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్లో చేర‌మంది. న‌చ్చ‌క‌పోతే డైరెక్ష‌న్ డిపార్ట్ మెంట్‌ లోకి వెళ్లిపొమ్మంది. కానీ.. ప్రొడ‌క్ష‌న్‌ లోకి దిగాక ఎంజాయ్ చేయ‌టం మొద‌లుపెట్టా. ఇప్పుడు ప్రొడ‌క్ష‌న్లో కుదుట‌ప‌డ్డా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News