నిన్న మొన్నటి వరకూ అందరినీ కోవిడ్ భయం వెంటాడింది. అందువలన థియేటర్స్ కి రావడానికి జనాలు భయపడ్డారు. ఆ తరువాత థియేటర్స్ కి చిన్న సినిమాలు క్యూ కట్టాయి. అప్పుడు కూడా థియేటర్లు సగం కూడా నిండలేదు. దాంతో చిన్న సినిమాలు ఓటీటీలను ఆశ్రయించాయి. నెలలోపే ఓటీటీలో వస్తాయి కదా అనవసరంగా థియేటర్స్ కి ఎందుకు అని జనాలు మరింత వెనకడుగు వేశారు. స్టార్ కేటగిరిలో ఉన్న హీరోల సినిమాలకి జనాలు వస్తున్నారు కదా అని ఈ సమయంలోనే టిక్కెట్ల రేట్లు పెంచేశారు.
దాంతో చిన్న సినిమాలకి మాత్రమే కాదు .. రెండో వరుసలో ఉన్న స్టార్ హీరోల సినిమాల కోసం కూడా థియేటర్లకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మేకర్స్ ఇక లాభం లేదనుకుని టిక్కెట్ల రేట్లు అందుబాటులో ఉంచామని పనిగట్టుకుని చెప్పవలసి వస్తోంది .. అయినా మేం నమ్మం గాక నమ్మం అన్నట్టుగా జనాలు థియేటర్లకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే 'హ్యాపీ బర్త్ డే' అనే చిన్న సినిమా ఒకటి జులై 8వ తేదీన థియేటర్లకు రావడానికి రెడీ అవుతోంది.
ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ - ఏఎంబీ సినిమాస్ లో జరిగింది. ఈ వేదికపై నుంచి ట్రైలర్ ను వదిలారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా వచ్చిన రాజమౌళి మాట్లాడుతూ .. ఆడియన్స్ ఎందుకని థియేటర్లకు రావడం తగ్గిందనేదే విషయాన్ని గురించి ఫస్టు టైమ్ ప్రస్తావించారు. "ఈ మధ్య కాలంలో ఆడియన్స్ థియేటర్స్ కి రావడం బాగా తగ్గింది.
అందుకు ఎవరికి తోచిన కారణం వాళ్లు చెబుతున్నారు. కంటెంట్ పరంగా హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే జనాలు థియేటర్స్ కి రావడం లేదని నేను అనుకుంటున్నాను.
పూర్తి స్థాయి ఎఫర్ట్స్ పెడితే ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్ కి వస్తారనే నమ్మకం నాకు ఉంది. అంటే కంటెంట్ పూర్తి కామెడీ .. పూర్తి యాక్షన్ అన్నట్టుగా ఉంటే తప్పకుండా వస్తారని భావిస్తున్నాను.
ఆడియన్స్ కి ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నామో అది పూర్తిగా ఇచ్చేయాలి .. అందులో సందేహాలు .. సంధిగ్ధాలు ఉండకూడదు. రితేశ్ రానా పూర్తి కామెడీని అందించే ప్రయత్నం చేశాడు గనుక, ఈ సినిమా కోసం ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్ కి వస్తారనే నమ్మకం నాకు ఉంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.