ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ సంచలనాల గురించి తెలిసిందే. బాహుబలి రిలీజ్ అనంతరం.. రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్రకు దక్కిన ఐడెంటిటీని ఎన్ క్యాష్ చేసుకునేందుకు ఫిలింమేకర్స్ చేయని ప్రయత్నం లేదు. కేవలం శివగామి కథను ఎంచుకుని వెబ్ సిరీస్ లు.. సినిమాలు అంటూ ప్రకటించడం చూస్తే.. ఎంత క్రేజీనో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో రాణి శివగామి అనే సినిమా తెరకెక్కుతోంది. కన్నడ- తెలుగు ద్విభాషా చిత్రం త్వరలో రిలీజ్ కి రానుంది.
అలాగే శివగామి ప్రధాన పాత్రలో బాహుబలి నిర్మాతలే నెట్ ఫ్లిక్స్ తో కలిసి ఓ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. శివగామి అనేది టైటిల్. దీనికి ప్రవీణ్ సత్తారు- దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే తొలి సీజన్ ఎనిమిది ఎపిసోడ్లు చిత్రీకరించారు. ఆనంద్ నీలకంఠ రచించిన `ది రైజ్ ఆఫ్ శివగామి` ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు. బాహుబలి నిర్మాతలు ఆర్కా మడియా వాళ్లు సహనిర్మాతలుగా వ్యవహరిస్తుండగా... నెట్ ఫ్లిక్స్ పెట్టుబడులు పెడుతోంది. ఇప్పటికే ఫైనల్ కట్ రెడీ అయ్యిందని.. వీఎఫ్.ఎక్స్ సహా అంతా పూర్తయిందని తెలుస్తోంది. ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ పూర్తయిపోయాయి. అయితే ఫైనల్ విజువల్స్ మాత్రం ఆర్కా వాళ్లను.. నెట్ ఫ్లిక్స్ ప్రతినిధుల్ని పూర్తిగా మెప్పించలేకపోయాయిట. అందుకే డైలమాలో ఉన్నారని ఓ ప్రచారం సాగుతోంది.
బాహుబలి రేంజు సినిమా చూశాక.. శివగామి పాత్రను పెద్ద తెరపై చూసిన ఆడియెన్ ని మెప్పించడం అంటే ఆషామాషీ కాదు. అంతకుమించిన కథ-కథనం.. గ్రిప్పింగ్ నేరేషన్ తో మెప్పించాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళినే రంగంలోకి దించి రిపేర్లు చేయిస్తారా? అంటూ మరో ఆసక్తికర ప్రచారం సాగుతోంది. అయితే ఇవన్నీ నిజమా? కేవలం అసత్య ప్రచారమా? అన్నది దేవాకట్టా టీమ్ చెప్పాల్సి ఉంటుంది.