సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ ల కలయికలో దాదాపు పదకొండేళ్ల విరామం తరువాత ఓ భారీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మించబోతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రెండు నెలల క్రితమే లాంఛనంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది.
వచ్చే వారం నుంచే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. పవర్ ఫుల్ గా సాగే హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించబోతున్నారు. ఇందు కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయట.
అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ నడుస్తున్న బస్సులో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన `పోకిరి` ఇండస్ట్రీ హిట్ గా నిలిచి తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని రికార్డుల్ని సృష్టించింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో లోకల్ ట్రైన్ ఫైట్ వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే తరహా ఫార్ములాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ SSMB28 కోసం వాడబోతున్నారట. అయితే `పోకిరి` లోని టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్ ని లోకల్ ట్రైన్ లో ప్లాన్ చేస్తే SSMB28 కోసం త్రివిక్రమ్ అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్ ని బస్ లో ప్లాన్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని దాదాపు గా 20 రోజులకు పైగా చిత్రీకరిస్తారట. సినిమాకు ఈ ఫైట్ ప్రధాన హైలైట్ గా నిలవనుందని తెలిసింది.
`పోకిరి`లో లోకల్ ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ చేసిన ఫైట్ చాలా వైల్డ్ గా వుంటుంది. మరి SSMB28 కోసం త్రివిక్రమ్ ..మహేష్ ని ఏవిధంగా చూపించబోతున్నాడో.. ఫైట్ సీక్వెన్స్ ని ఏ రేంజ్ లో షూట్ చేయబోతున్నాడో అని ఫ్యాన్స్ అప్పుడే ఆరాలు తీయడం మొదలు పెట్టారట. `అరవింద సమేత` లో ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలచిన విషయం తెలిసిందే. SSMB28 కోసం కూడా అదే స్థాయిలో భారీగా హైవోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని త్రివిక్రమ్ ప్లాన్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీలోని కీలక పాత్రలో మలయాళ నటుడు రోషన్ మాథ్యూ నటించనున్నాని వార్తలు వినిపిస్తున్నాయి. విక్రమ్ నటించిన `కోబ్రా` మూవీలో రోషన్ మాథ్యూ మెయిన్ విలన్ గా నటించిన విషయం తెలిసిందే. నాని నటిస్తున్న `దసరా`లోనూ రోషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో మహేష్ కోసం తనని త్రివిక్రమ్ రంగంలోకి దించేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ, ప్రాజెక్ట్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాష్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.