సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా షూటింగ్ ఈరోజు సోమవారం ప్రారంభమైంది.
#SSMB28 ప్రాజెక్ట్ రెగ్యులర్ షూట్ బిగిన్ చేసిన నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ డే షూటింగ్ కు సంబంధించిన ఈ వీడియో.. సెట్ లో వాతావరణాన్ని చూపిస్తోంది. స్పెషల్ గా ఏర్పాటు చేసిన సెట్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్ ని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
'కేజీఎఫ్' స్టంట్ మాస్టర్స్ ద్వయం అన్బరివ్ ఈ యాక్షన్ పార్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ఇందులో మహేష్ బాబు - త్రివిక్రమ్ - సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ మరియు నిర్మాతలు ఎస్. రాధా కృష్ణ - నాగవంశీ తదితరులు సెట్ లో చర్చించుకోడాన్ని మనం చూడొచ్చు.
ఈ వీడియోలో బ్లాక్ డ్రెస్ లో మహేష్ సెట్ లో అడుగుపెట్టాడు. అలానే దర్శకుడు త్రివిక్రమ్ చెప్పే దాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడాన్ని గమనించవచ్చు. పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను సూచించే కొన్ని షాట్స్ ని కూడా చూపించారు.
#SSMB28AARAMBHAM అనే పదాలతో ఈ వీడియో ముగుస్తుంది. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ అని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. దీనికి తగ్గట్టుగానే ఫైట్ సీన్ తో షూటింగ్ మొదలు పెట్టారు. థమన్ కంపోజ్ చేసిన ఫుట్-ట్యాపింగ్ స్కోరును ఈ వీడియోలో శాంపిల్ గా వినిపించారు.
#SSMB28 అనేది మహేష్ బాబు మరియు త్రివికమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ. ఇంతకుముందు 'అతడు' 'ఖలేజా' వంటి సినిమాలు చేశారు. దాదాపు పుష్కర కాలం తర్వాత బ్లాక్ బస్టర్ కాంబో ఈ ప్రాజెక్ట్ కోసం కలుస్తుండంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.
ఇది ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ అని నిర్మాత నాగవంశీ ట్వీట్ చేసాడు. సూపర్ స్టార్ మాస్సీ రగ్గుడ్ అవతార్ లో కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో మహేశ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ నటుడు ఆర్కే సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. త్వరలో మిగతా నటీనటుల వివరాలు వెల్లడి కానున్నాయి.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేస్తుండగా.. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. SSMB28 నుంచి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం వేచి ఉండండి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View