త్రివిక్రమ్‌ నో లేట్‌.. మహేష్‌ తర్వాత వైకుంఠపురమే!

Update: 2022-09-06 01:30 GMT
అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ కరోనా ఇతర కారణాల వల్ల ఏకంగా రెండున్నర సంవత్సరాల కంటే కూడా అధికంగా కాలయాపన చేశాడు. ఆ సమయంలో ఆయన వేరు వేరు ప్రాజెక్ట్‌ లకు వర్క్ చేశాడు కానీ ఆయన దర్శకత్వంలో సినిమా మాత్రం రాలేదు.

ఆయన సినిమా మూడు సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు తో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే వచ్చే ఏడాది ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. మహేష్ తో చేయబోతున్న సినిమా తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి సినిమాను మొదలు పెట్టబోతున్నాడట.

మహేష్ బాబు సినిమా ను సమ్మర్ లో విడుదల చేసి.. అదే సమర్ లో అల్లు అర్జున్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడట. ఆ లోపు అల్లు అర్జున్ పుష్ప 2 ను ముగించబోతున్నాడు. పుష్ప 2 మరియు మహేష్‌ 28 సినిమాలు అటు ఇటుగా ఒకే సారి పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కనుక హీరో బన్నీ మరియు దర్శకుడు త్రివిక్రమ్ ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా సినిమాను మొదలు పెట్టి వచ్చే ఏడాదిలోనే చివర్లో లేదా ఆ తర్వాత ఏడాది అంటే 2024 సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే స్టోరీ లైన్ సిద్ధం అయ్యింది. స్క్రిప్ట్‌ వర్క్ కూడా దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చిందని టాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇప్పటికే జులాయి.. సన్నాఫ్‌ సత్యమూర్తి మరియు అల వైకుంఠపురంలో సినిమాలతో బన్నీ.. త్రివిక్రమ్‌ జోడీ హ్యాట్రిక్ ను దక్కించుకుంది. కనుక మరో సినిమా వస్తే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరి కాంబో సినిమా కోసం ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News