టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొత్తానికి సర్కారు వారి పాట సినిమాతో బాక్సాఫీసు వద్ద మరొక మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తదుపరి సినిమాతో అంతకుమించి హిట్ అందుకోవాలనే సూపర్ స్టార్ రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోతున్న తన 28వ సినిమా యాక్షన్ అడ్వెంచర్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది.
అయితే ఆ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ను జూలై నెలలోనే మొదలు పెట్టబోతున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని వీలైనంత త్వరగా షూటింగ్ ను మొదలుపెట్టాలి అని చూస్తున్నారు. మహేష్ బాబు ఇటీవల అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అమెరికా నుంచి తిరిగి రాగానే మొదటి షెడ్యూల్ ను స్టార్ట్ చేస్తాడు అని తెలుస్తోంది. ఇక ఆ సినిమా ఎలాంటి సన్నివేశాలతో మొదలవుతుంది అనే వివరాల్లోకి వెళితే.. త్రివిక్రమ్ ఇంతకుముందు చేసిన అతడు ఖలేజా సినిమాలు రెండూ కూడా మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తోనే షూటింగ్ మొదలు పెట్టారు.
ఇక ఇప్పుడు SSMB28 ప్రాజెక్ట్ కూడా అదే తరహాలో మంచి యాక్షన్ సీన్స్ తో షూటింగ్ మొదలు పెట్టబోతున్న ట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ స్టైల్ లో లాజిక్ తోనే సీక్వెన్స్ ను క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా లాజిక్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మహేష్ అంతకుమించి అనేలా మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. అలాగే మరొక ముఖ్యమైమ పాత్రలో ఇంకో హీరోయిన్ ను కూడా సెలెక్ట్ చేయనున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఈ ఏడాదిలోనే పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. సినిమాకు అర్జునుడు అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్ ఫిక్స్ అయితే గనుక ఈ నెల 30వ తేదీన కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ఫస్ట్ పోస్టర్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.