సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబోలో సినిమా కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ నేటి నుండి షూటింగ్ ప్రారంభించిన విషయం తెల్సిందే. గత నెలలో ప్రారంభించాల్సి ఉన్నా కూడా టాలీవుడ్ నిర్మాతల బంద్ కారణంగా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడు సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
నేడు మహేష్ బాబు పై కీలక సన్నివేశాలకు సంబంధించిన షాట్స్ ని చిత్రీకరించినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రకు గాను తమిళ ప్రముఖ నటుడు ఆర్ కే సురేష్ ను ఎంపిక చేయడం జరిగింది. ఆయన కూడా షూటింగ్ మొదటి రోజే మహేష్ బాబుతో కలిసి షూట్ లో పాల్గొన్నాడు. మొదటి రోజు షూట్ లోనే మహేష్ బాబును కలవడం సంతోషంగా ఉందటూ ఆర్ కే సురేష్ పేర్కొన్నాడు.
సోషల్ మీడియాలో తన తెలుగు సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ను సురేష్ షేర్ చేశాడు. తమిళ్ లో మంచి గుర్తింపు దక్కించుకుని స్టార్ డమ్ దక్కించుకున్న సురేష్ కి మంచి నటుడిగా పేరు దక్కింది. అందుకే ఈ సినిమాలో ఆయనకు సరిపోయే పాత్ర ను దర్శకుడు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ తమిళ్ తంబికి సక్సెస్ దక్కితే ఇక్కడ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేడు షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు ఎలాంటి బ్రేక్ లు లేకుండా వరుసగా షెడ్యూల్స్ ను చేయబోతున్నారు. తద్వారా సినిమా ను కేవలం మూడు నాలుగు నెలల్లోనే ముగించాలని భావిస్తున్నారట.
వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా విడుదలకు ఇప్పటికే డేట్ ఫిక్స్ అయ్యింది. కనుక ఎక్కడ ఆలస్యం చేయకుండా దర్శకుడు త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ను ముగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుండగా పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యుల నుండి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి రాబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.