టాలీవుడ్ అగ్రదర్శకులలో ఒకరైన రైటర్ కమ్ డైరెక్టర్ త్వరలోనే ప్రొడక్షన్ లోకి దిగనున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న ఆ డైరెక్టర్ సొంత ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించి కొత్త దర్శకులకు ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ముందుగా ప్రముఖ ఓటీటీ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. తాను రాసిన స్టోరీని అందించి గత కొంత కాలంగా తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తికి దర్శకత్వ బాధ్యలు అప్పగిస్తున్నాడని తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంతున్నారట. అయితే ఈ వెబ్ సిరీస్ లో సామాజిక అంశాలతో పాటు ఇండస్ట్రీలో సినిమా కష్టాల గురించి మోసాల గురించి ఎక్కువగా చూపించనున్నారని సమాచారం. ముఖ్యంగా ఇండస్ట్రీలో జరిగే కొన్ని మోసాలను తెలియజేసేలా సదరు డైరెక్టర్ ఈ సిరీస్ ప్లాన్ చేసాడని తెలుస్తోంది. అయితే టాలీవుడ్ లో ఇంతకముందు ఎదురైన చేదు అనుభవాలతోనే ఈ స్టోరీ రాసాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.
కాగా, ఆ రైటర్ కమ్ డైరెక్టర్ టాలీవుడ్ లో మరో స్టార్ డైరెక్టర్ చేతిలో మోసపోయాడని టాక్ ఉంది. గతంలో ఓ రైటర్ దగ్గర శిష్యరికం చేసిన ఆ ఇద్దరూ కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలకు పని చేశారు. అయితే బ్లాక్ బస్టర్ అయిన ఓ సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాయించుకొని ఆ సినిమా టైటిల్ కార్డ్ లో కనీసం ఈ రచయిత పేరు వేయకుండా క్రెడిట్ మొత్తం తనదే అని చెప్పుకున్నాడు ఆ స్టార్ డైరెక్టర్. అయితే ఆ రైటర్ కమ్ డైరెక్టర్ తనకు జరిగిన అన్యాయాన్ని మోసాన్ని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టి సంచలనం రేపాడు. ఆ విషయం తనకి చాలా బాధ కలిగించిందని.. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని.. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుంటే తాను ఇంకా తొందరగా పేరు తెచ్చుకునే వాడినేమో అని చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఈ వివాదం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఐతే ఇప్పుడు సదరు డైరెక్టర్ తీయబోయే వెబ్ సిరీస్ ద్వారా తనను మోసం చేసిన డైరెక్టర్ ని టార్గెట్ చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే వరకు ఆగాల్సిందే.