స్టార్ హీరోలంటేనే వాళ్ళకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఏదో విదేశాల్లో తప్ప లోకల్ గా వాళ్ళు ఎక్కడికిపోయినా వీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తారు. ఇది చాలా కామన్ విషయం. కానీ తమిళ స్టార్ హీరో 'తల' అజిత్ మాత్రం ఇలాంటి వాటికి వ్యతిరేకం. చాలా సింపుల్ గా ఉంటాడని.. హంగామాలకు దూరంగా ఉంటాడని పేరు. సినిమాలు తప్ప.. ఆడియో ఫంక్షన్లని.. సక్సెస్ మీట్ లని పెట్టడం కూడా అస్సలు జరగదు. కానీ ఈమధ్య చైన్నై విమానాశ్రయంలో అజిత్ కు ఇచ్చిన స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది.
అజిత్ చెన్నై విమానాశ్రయంలో ఫ్లైట్ దిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్ట్ అధికారులు ఒక ఎగ్జిట్ డోర్ ను సాధారణ ప్రయాణీకులు వాడుకోకుండా క్లోజ్ చేశారట. దీంతో వారందరూ దూరంగా ఉన్న మరో ఎగ్జిట్ డోర్ వద్దకు నడుచుకుని వెళ్ళాల్సి వచ్చింది. అజిత్ కోసం ఇలా ఒక డోర్ ను క్లోజ్ చేసి ఆయనొక్కడినే ప్రత్యేకంగా ఆ డోర్ నుండి బయటకు పంపడంతో అది ఇప్పుడు చర్చలకు దారి తీసింది.
దీనివెనక ఏదైనా ప్రత్యేక కారణం ఉందో లేదో తెలియదు గానీ విమానాశ్రయ అధికారులపై మాత్రం విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మరో వైపు ఇలాంటివాటిని ఎప్పుడూ ఎంకరేజ్ చెయ్యని అజిత్ కూడా ఇలా చేయడం బాగాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.