మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఈ మధ్య కాలంలో సంక్రాంతి సీజన్ లో పోటీకి దిగలేదు. పోటీ పడిన సందర్భమూ లేదు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం సై అంటే సై అంటూ సంక్రాంతి ఫెస్టివెల్ బరిలో పోటీపడిన చిరంజీవి, బాలకృష్ణ ఈ సారి అనూహ్యంగా 2023 సంక్రాంతికి సై అంటే సై అంటూ పోటీకి కాలుతువ్వుతున్నారు. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ `వాల్తేరు వీరయ్య`.
బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఒత్తిడి కారణంగా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసే పనిలో వున్నారు. `గాడ్ ఫాదర్` తరువాత చిరు నుంచి వస్తున్న మాస్ బొమ్మ కావడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ తో పాటే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `వీర సింహారెడ్డి` కూడా రిలీజ్ కాబోతోంది.
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతోంది. దీనిపై బాలయ్య ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే బాలకృష్ణకు చిరు `వాల్తేరు వీరయ్య` తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. కారణం ఈ రెండు సినిమాలని మైత్రీ మూవీ మేకర్సే నిర్మిస్తోంది. ఆ కారణంగా రెండు సినిమాలని ఫాస్ట్ గా పూర్తి చేయాలని చక చకా పావులు కదుపుతూ షూటింగ్ ని పరుగులు పెట్టిస్తోందట.
అదే బాలయ్యకు మండుకొచ్చేలా చేస్తోందని ఇన్ సైడ్ టాక్. ఈ ఉరుకుల పరుగుల కారణంగా బాలయ్య సెట్ లో కాస్ట్యూమర్ ని భయపెట్టినట్టుగా తెలుస్తోంది. అతనిపై తన ఫ్రస్ట్రేషన్ ని బాలయ్య వెల్లగక్కారట. ఆ తరువాత పరిస్థితి సద్దుమనిగినా తీవ్ర మనస్తాపానికి గురైన కాస్ట్యూమర్ షూటింగ్ కాలేదని తెలుస్తోంది. ఈ విషయమై బాలయ్య నిర్మాతలపై కూడా ఫైర్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
`వాల్తేరు వీరయ్య` స్పీడుగా పూర్తవుతున్న కారణంగా అదే స్థాయిలో బాలయ్య సినిమాని కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేసిన మేకర్స్ ప్లాన్ బెడిసికొట్టి బాలయ్యకు మండేలా చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.