స్టార్ హీరో మాజీ సతీమణి లవ్ ఎఫైర్ ఫ్రూఫ్ దొరికినట్లే

Update: 2021-12-22 05:32 GMT
ప్రేమలు.. పెళ్లిళ్లు.. అంతలోనే విడిపోవటం.. ఆ వెంటనే మరో లవ్ ట్రాక్ షురూ చేయటం లాంటివి బాలీవుడ్ లో ఎక్కువగా చూస్తుంటాం. అక్కడ ప్రేమ.. పెళ్లి.. విడాకులు అన్నవి ఎప్పుడైనా జరిగేవే. ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోవటానికి వీలైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. తనకైనా చిన్నవాడితో రొమాన్సు అనక పెళ్లి చేసుకోవటం బాలీవుడ్ లో తరచూ కనిపిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య సుసానే ఖాన్ తాజా లవ్ ట్రాక్ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. ఆమెకు నటుడు ఆర్ల్సాన్ గోనితో రిలేషన్ షిప్ ఉందన్న మాట కొద్దికాలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరు ప్రేమపక్షుల మాదిరి వ్యవహరిస్తున్నారని.. కలిసి ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.

అయితే.. వీరిద్దరి రిలేషన్ షిప్ మీద ఎప్పుడూ బయటకు మాట్లాడింది లేదు. కాకుంటే.. వారి పుట్టిన రోజు సందర్భంగా ఒకరిపై ఒకరికున్న ప్రేమాభిమానాల్ని బయట ప్రపంచానికి చాటేలా వారు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. తాజాగా అదే తీరులో వారికి సంబంధించిన పోస్టు ఒకటి అందరిని ఆకర్షిస్తోంది. అందుకే.. సుసానే రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ గా అర్స్లాన్ గోనిగా పలువురు అభివర్ణిస్తుంటారు. తాజాగా సుసానే చేసిన పోస్టు.. వారిద్దరి మధ్య రిలేషన్ షిప్ నడుస్తుందన్న దానికి నిదర్శనంగా మారింది.

డిసెంబరు 20న గోని పుట్టిన రోజు. ఈ సందర్భంగా సుసానే.. అతడితో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసి.. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు.. నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ ఉండాలని.. స్వచ్ఛమైన ప్రేమ నీ చుట్టూ ఉండాలని కోరుకుంటున్నా. నా జీవితంలో ఇప్పటివరకు చూసిన ఒక అందమైన శక్తిని నువ్వు’ అంటూ తన ప్రేమను తెలియజేసింది. దీనికి గోని స్పందిస్తూ.. లవ్యూ అంటూ రిప్లై ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. కొద్ది నెలల క్రితం సునానే పుట్టిన రోజు సందర్భంగా గోని సైతం ఇదే తరహాలో పోస్టు పెట్టటాన్ని గుర్తు చేస్తున్నారు. ‘పుట్టిన రోజు శుభకాంక్షలు డాళింగ్. నీ జీవితం అద్భుతంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. నువ్వు కోరుకున్నదంతా భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. నా జీవితంలో నేను చూసిన గొప్ప మనసున్న వ్యక్తికి నువ్వు’ అంటూ తన ప్రేమను తెలియజేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్‌ రోషన్‌.. సుసానేలు.. తమ పద్నాలుగేళ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టి.. ఇరువురు అధికారికంగా విడిపోయారు. తాజాగా.. సుసానే పెట్టిన పోస్టు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. వీరిద్దరి రిలేషన్ ను దాదాపుగా ఓపెన్ చేసినట్లుగా చెబుతున్నారు. మరి..తర్వాతి పెళ్లి కార్యక్రమం ఇంకెప్పుడో చూడాలి.



Tags:    

Similar News