టాలీవుడ్ లో అసాధారణ ప్రయోగాలకు తెర లేచింది. మల్టీస్టారర్లతో మన పరిశ్రమ మరో బాలీవుడ్ ని తలపిస్తోంది. మునుపెన్నడూ లేని ఓ కొత్త ఒరవడి ఇది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుగుదలకు సూచిక ఇదనే చెప్పాలి. కథానాయకుల మధ్య సఖ్యత ఇందుకు ఆస్కారం కల్పిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలంతా ఒకరితో ఒకరు కలిసిమెలిసి స్నేహంగా ఉంటున్నారు. ఒకరి సినిమాల్లో ఒకరు నటిస్తున్నారు. ఒకరి సినిమాలకు ఇంకొకరు ప్రచారం చేస్తున్నారు. ఇది దర్శకనిర్మాతలకు కొత్త దారిని చూపిస్తోంది. మల్టీస్టారర్ కథలకు మరింతగా ఆస్కారం కల్పిస్తోంది.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ వరుసగా మల్టీస్టారర్లకు సంతకాలు చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. ప్రస్తుతం కెరీర్ 25వ సినిమా `మహర్షి`లో అల్లరి నరేష్ తో కలిసి నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ - నరేష్ స్నేహితులుగా కనిపిస్తారని - కుచేలుడు- శ్రీకృష్ణుడు తరహా స్నేహమిదని ప్రచారం సాగుతోంది. మహేష్ కాలేజ్ విద్యార్థిగా - రైతుగా కనిపించి సర్ ప్రైజ్ చేయనున్నాడన్న సంగతి ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఈ సినిమా తర్వాత మహేష్ నటించే 26వ సినిమాలోనూ అంతకుమించిన సర్ ప్రైజ్ ఉంటుందిట. మహేష్ - సుకుమార్ సినిమాలో 25 నిమిషాల పాత్ర వేరొక స్టార్ హీరో కోసం సిద్ధమవుతోందిట. ప్రభాస్ ని ఆ పాత్రకు ఒప్పించాలని సుకుమార్ భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కి కుదరని పక్షంలో చరణ్ - ఎన్టీఆర్ లో ఎవరో ఒకరిని సుకుమార్ ఒప్పిస్తాడట. ఈ పాత్ర కథలో కీలక మలుపు నిచ్చే విధంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు పనులు వేగంగానే సాగుతున్నాయ్. 25వ సినిమా మహర్షి పూర్తవ్వగానే 26వ సినిమా సన్నాహాలు చేయనున్నారని తెలుస్తోంది. 1-నేనొక్కడినే ఫ్లాప్ కావడంతో సుకుమార్ ఈసారి కథ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. `రంగస్థలం` తరహాలో బ్లాక్ బస్టర్ ని మహేష్‌కి ఇవ్వాలన్న తాపత్రయం సుక్కూలో కనిపిస్తోందని సన్నిహితులు చెబుతున్నారు.