శ్రీలంక అడ‌వుల్లో స్టార్ హీరో విన్యాసాలు!

Update: 2022-11-26 00:30 GMT
స్టార్ హీరో సూర్య వ‌రుస హిట్స్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. క‌థా బ‌లం  ఉన్న  చిత్రాలు చేస్తూ  సూర్య బ్రాండ్ చాటుతున్నాడు. న‌టుడిగా 50 చిత్రాల‌కు ద‌గ్గ‌ర‌వుత‌న్నాడు. ఈనేప‌థ్యంలో ఎంపిక చేసుకునే ప్ర‌తీ క‌థా యూనిక్ గా ఉండాల‌ని జాగ్ర‌త్త  ప‌డుతున్నారు. సినిమాతో పాటు..పాత్ర ప‌రంగానూ తాను హైలైట్ అవ్వాల‌ని చూజీగా వెళ్తున్నాడు.

 ప్ర‌స్తుతం ఆయ‌న‌  క‌థానాయ‌కుడిగా త‌న 42వ చిత్రం శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇది రెండు భాగాలుగా తెర‌కెక్కుతోంది. ఇప్ప‌టికే మొద‌టి పార్ట్ షూట్ లో భాగంగా  మొద‌టి షెడ్యూల్ గోవా..చెన్నైలో పూర్తి చేసారు. తాజాగా కొత్త షెడ్యూల్ ని ఏకంగా శ్రీలంక‌లోనే ప్లాన్ చేసారు. అక్క‌డ ద‌ట్ట‌మైన అడ‌వుల్లో షూట్ చేయాల్సిన కీల‌క‌మైన  స‌న్నివేశాలు ఉండ‌టంతో త‌దుప‌రి షెడ్యూల్ మొత్తం అక్క‌డే ఉంటుంద‌ని తెలుస్తోంది.

త్వ‌ర‌లోనే టీమ్ మొత్తం శ్రీలంక ప్లైట్ ఎక్కనున్న‌ట్లు తెలుస్తోంది. ఇండియాలో చాలా ర‌కాల అడ‌వులు ఉండ‌గా..శ్రీలంక అడవులే ఎంపిక చేసుకోవ‌డానికి ప్ర‌త్యేక‌మైన కార‌ణం ఏదైనా ఉందా? అంటే అవున‌నే తెలుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన అడ‌వుల్లో కొన్ని ప్ర‌త్యేక లొకేష‌న్లు ఉన్నాయిట‌. అలాగే ఈ క‌థ‌కి సంబంధించిన చ‌రిత్ర‌ అక్క‌డ ఇంకా ఉందిట‌. సుమారు వెయ్యి సంవ‌త్స‌రాల క్రితం నాటి కొన్ని స‌న్నివేశాలు  కేవ‌లం ఆ ప్రాంతంలోనే షూట్ చేస్తే కొంత వ‌ర‌కూ వాస్త‌విక‌త క‌నిపిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు అక్క‌డ ప్లాన్ చేసిన‌ట్లు  స‌మాచారం.

ఇవి సినిమాలో చాలా కీల‌క‌మైన స‌న్నివేశాల‌ని తెలుస్తోంది.  అనంత‌రం విదేశాల్లోనూ మ‌రికొన్ని స‌న్నివేశాలు షూట్ చేయాల్సి ఉందిట‌. శ్రీలంక షెడ్యూల్ త‌ర్వాత విదేశీయానం  ఉంటుంద‌ని తెలుస్తోంది. అలాగే  ఏప్రిల్ నాటికి  సినిమాకి సంబంధించిన అన్నిప‌నులు  పూర్తి చేయాల‌న్న‌ది యూనిట్ టార్గెట్. అటుపై రిలీజ్ తేదీ నిర్ణ‌యించి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా ప‌టానీ న‌టిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News