'ఎంఎస్ ధోనీ' చిత్రంతో ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కించుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ప్రస్తుతం బాలీవుడ్ లో చాలా బిజీ హీరోగా ఉన్న సుశాంత్ ఇటీవలే యూరప్ నుండి ఇండియాకు వచ్చాడు. ఇండియాకు వచ్చినప్పటి నుండి అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ హాస్పిటల్ లో టెస్టు చేయించుకోగా డెంగీ అని నిర్ధారణ అయ్యిందట. ఈమద్య కాలంలో బాలీవుడ్ కు చెందిన పలువురు కూడా డెంగీతో బాధపడ్డారు.
ప్రస్తుతం డెంగీకి సుశాంత్ చికిత్స చేయించుకుంటున్నట్లుగా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థ కథనంను ప్రచురితం చేసింది. ఆ కథనం ప్రకారం గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుశాంత్ కు వైధ్యులు డెంగీ టెస్టు చేయగా పాజిటివ్ వచ్చిందని దాంతో ఆయన్ను ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లుగా ఆ కథనంలో పేర్కొనడం జరిగింది. ఒక కార్యక్రమం కోసం అబుదభి వెళ్లాల్సి ఉన్న సుశాంత్ అనారోగ్య కారణంగా ఆ టూర్ ను రద్దు చేసుకున్నట్లుగా సదరు కథనంలో చెప్పడం జరిగింది.
సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలో కూడా గత మూడు నాలుగు నెలలుగా డెంగీ జ్వరాలు వందలాది మంది సామాన్యుల ప్రాణాలు తీశాయి. డెంగీ జ్వరంతో పాటు రక్త కణాల సంఖ్య తగ్గడం.. తీవ్రమైన ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు ఈమద్య కాలంలో చాలా ఎక్కువ అయ్యాయి. సామాన్యులకే అనుకుంటే సెలబ్రెటీలకు కూడా డెంగీ తప్పలేదు. సుశాంత్ ను కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలంటూ వైధ్యులు సూచించారట