తమిళ స్టార్ హీరో సూర్య గత చిత్రం సూరారై పోట్రు కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో అమెజాన్ ప్రైమ్ ద్వారా డైరెక్ట్ రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. సినిమా కు అవార్డులు రివార్డులు ఎన్నో దక్కాయి. సూర్య నటనపై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు సూరారై పోట్రు ను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు మరియు తమిళంలో సూరారై పోట్రు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం సూర్య నుండి మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. అందులో మొదటిగా జై భీమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయిన విషయాన్ని ప్రకటించకుండా సినిమా ను టైటిల్ తో ప్రకటించి అందరిని ఆశ్చర్యపర్చారు.
జై భీమ్ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా గా మొదటి నుండి చెబుతున్నారు. ఒక మహిళ వెనుక ఉండి పోరాటం సాగించిన వ్యక్తి యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా నుండి ఇప్పటికే సూర్య లుక్ వచ్చింది. అంచనాలు పెంచేలా జై భీమ్ లుక్ ఉందంటూ కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 2న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. అమెజాన్ లో భారీ ఎత్తున ఈ సినిమాను ప్రమోట్ చేసి స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూర్య ఈ సినిమా లో లాయర్ గా కనిపించబోతున్నట్లుగా పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది.
మహిళ కోసం న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో సూర్య కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించగా.. ఈ సినిమాలో సూర్య బాబా సాహెబ్ అంబేద్కర్ తరహాలో కనిపించబోతున్నట్లుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. టైటిల్ ను చూసినా కూడా అంబేద్కర్ ను గుర్తుకు తీసుకు వచ్చేలా ఉంది. అందుకే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై తమిళ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమా విడుదల సమయంకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని కలిగిస్తారా అనేది చూడాలి. సూర్య ఈ సినిమా మాత్రమే కాకుండా మరో మూడు నాలు సినిమాలు కూడా విడుదలకు అవుతున్నాయి. కొన్ని షూటింగ్ దశలో ఉండగా కొన్ని చర్చల దశలో ఉన్నాయి. అవి వచ్చే ఏడాదిలో థియేటర్ల ద్వారా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సూరారై పోట్రు తో ఇప్పటికే అమెజాన్ లో మెస్మరైజ్ చేసిన సూర్య మరోసారి జై భీమ్ తో అమెజాన్ ద్వారా మెస్మరైజ్ చేయడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.