తారల విడాకుల వార్తలు నిత్యం సినీ ఇండస్ట్రీలో పతాక స్థాయిలో నిలుస్తున్న విషయం తెలిసిందే. అలా విడిపోయిన వారు మళ్లీ కొత్త ప్రియుడు.. ప్రియురాలిని వెంటనే వెతుక్కుని కొత్త జర్నీని ప్రారంభిస్తున్నారు. అలా బాలీవుడ్ స్టార్ హీరో వైఫ్ కొత్తగా ప్రియుడిని వెతుక్కుంది. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తన బార్య సుసానే ఖాన్ తో విడిపోయి గత కొంత కాలంగా ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు. వారిని చూసుకుంటూనే హృతిక్ - సుసానే గత కొంత కాలంగా వేరు వేరుగా వుంటున్నారు. విడాకులు తీసుకున్నా పిల్లల కోసం అడపా దడపా కలుస్తూ వారిని ఆనందపరుస్తున్నారు. సుసానేతో విడిపోయాక హృతిక్ మరో పెళ్లి కానీ .. మరొకరితో లివిన్ రిలేషన్ షిప్ ని కానీ కోరుకోలేదు. కానీ అతని మాజీ భార్య సుసానే మాత్రం ఓ తోడుని.. కొత్త ప్రియుడిని ఎంచుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా సుసానే తన కొత్త ప్రియుడితో వున్న ఫొటో ఒకటి బయటికి వచ్చింది. అతను బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధంచిన వ్యక్తేనని తెలిసింది. అతని పేరు అర్స్లాన్ గోనీ. సుసానే పుట్టిన రోజు సందర్భంగా గ్రీటింగ్స్ తెలిపిన అర్స్లాన్ కిస్.. లవ్ ఎమోజీలని పోస్ట్ చేయడంతో వీరి బంధం బయటకు తెలిసింది. అంతే కాకుండా `మై ఎవ్రీథింగ్` అంటూ సుసానే సంబోధించడం మరింతగా వీరి బంధంపై పూర్తి క్లారిటీని ఇచ్చింది.
దీంతో బాలీవుడ్ మొత్తం హృతిక్ మాజీ భార్య ప్రియుడి గురించి కథనాలు వండి వారుస్తోంది. సోషల్ మీడియా వేదికగా తమ బంధాన్ని సుసానే బహిర్గతం చేయడంతో ప్రస్తుతం ఇది బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ బంధం పై సుసానే పోస్ట్ లపై స్టార్ హీరో హృతిక్ రోషన్ ఎలా స్పందిస్తాడో అంటూ అభిమానుల్లో చర్చ సాగుతోంది.