ఈ నెల 21న అన్నపూర్ణ స్టూడియోస్ లో టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ కు చెందిన వారితో టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి హాజరైన 74 మంది సినీ పెద్దలు....ఓ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే, ఆ సమావేశానికి పవన్ కల్యాణ్ కూడా హాజరవుతారని భావించారు. అయితే, భద్రతా కారణాల రీత్యా పవన్ హాజరు కాలేదు. ఆ తర్వాత పవన్....24 క్రాఫ్ట్స్ కు చెందిన వారితో సమావేశమవుతారని ప్రకటించినా...భద్రతా కారణాలతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత తన ట్విట్టర్ ఖాతా ద్వారా పవన్ ...తనను టార్గెట్ చేసిన వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నేడు టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలంతా సమావేశం కాబోతున్నారు. దాదాపు 20 మంది హీరోలు ఒకే రోజు సమావేశం కాబోతుండడం ఓ అరుదైన ఘటనగా చెప్పవచ్చు.
టీవీ 9 - ఏబీఎన్ - టీవీ 5 చానెళ్లపై పవన్ కళ్యాణ్ తిరుగుబాటు బావుటా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఆ చానెళ్లను బహిష్కరించాలని పవన్ పిలుపును కూడా ఇచ్చారు. ఇండస్ట్రీలోని మహిళలను టీవీ5 యాంకర్ అసభ్య పదజాలంతో దూషించినా ...ఇండస్ట్రీని కించపరిచేలా కార్యక్రమాలు ప్రసారం చేసినా ఇండస్ట్రీ తరఫు నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంపై పవన్ గుర్రుగా ఉన్నారు. ఇండస్ట్రీపై మీడియా వైఖరి....దానిపై భవిష్యత్ కార్యచరణ గురించి చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ లేవనెత్తిన అంశాలు....రాజకీయంగా కూడా ముడిపడి ఉండడంతో బాలకృష్ణ - చిరంజీవి చొరవ తీసుకుని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. పవన్ - ఎన్టీఆర్ - మహేష్ లతో పాటు నాని - శర్వానంద్ తదితర హీరోలందరూ ఈ సమావేశానికి హాజరవుతారని వినికిడి. అయితే, ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు కొన్ని మీడియా చానెళ్లు రాజీ ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని న్యూస్ చానెళ్ల పై వ్యతరేకత రావడం...ఆ చానెళ్లను బ్యాన్ చేస్తారన్న టాక్ రావడం వంటి పరిణామాల నేపథ్యంలో హుటాహుటిన ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. దాదాపుగా ఈ సమావేశానికి మీడియాకు ఆహ్వానం ఉండకపోవచ్చని...ఇది పూర్తిగా ఇండస్ట్రీ అంతర్గత సమావేశంగా జరగబోతోందని టాక్. సమావేశం తర్వాత ప్రెస్ మీట్ అయినా ఏర్పాటు చేస్తారా లేదా అన్నదానికపై స్పష్టత లేదు.