స్టార్ హీరోలకు ప్రేమ పిచ్చి పట్టిందిగా

Update: 2016-05-05 13:30 GMT
స్టార్ హీరోలంతా తమ ఇమేజ్ కు తగ్గ కథలనే చేసేందుకు ట్రై చేస్తుంటారు. అప్పుడప్పుడూ మినహాయిస్తే.. ఈ ఇమేజ్ చట్రంలోంచి బయటకు రాలేదు. కానీ ఎంత స్టార్స్ అయినా.. లవ్ ఫీల్ మిస్ అయ్యామే అనే ఫీల్ వచ్చినపుడు ఓ అందమైన ప్రేమకథకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు అదే జోనర్ లోకి ఎంటర్ అయ్యారు.

వరుసగా మాస్ - ఫ్యామిలీ మూవీస్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు లవ్ స్టోరీ చేసేశాడు. ఎస్ జే సూర్యతో చేయబోతున్న సినిమా.. ఓ ఫ్యాక్షనిస్ట్ ప్రేమకథ అని ముందే చెప్పేసింది యూనిట్. అల్లు అర్జున్ రూట్ కూడా ఇలాగే ఉంది. రీసెంట్ గా ఊరమాస్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బన్నీ.. ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ చేసి చాలా ఏళ్లయింది. ఇప్పుడు దర్శకుడు లింగుస్వామి ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు సమాచారం.

అక్కినేని నాగచైతన్య ప్రేమమ్ అంటూ ప్రేమను ముగ్గురు హీరోయిన్లకు పంచబోతున్నాడు. అఖిల్ అంటూ మాస్ మూవీతో దెబ్బతిన్న అఖిల్ కూడా రెండో సినిమాగా లవ్ స్టోరీనే సెలక్ట్ చేసుకుంటున్నాడు. లోఫర్ తర్వాత వరుణ్ తేజ్ చేస్తున్న శ్రీనువైట్ల మిస్టర్ కూడా ప్రేమ కథే. ఈ నెలలోనే విడుదలకు సిద్ధమవుతోంది త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. నితిన్ సమంత జంటగా నటించిన ఈ మూవీ ఓ అందమైన ప్రేమకథ. బన్నీతో సరైనోడు సక్సెస్ సాధించిన బోయపాటి.. బెల్లంకొండ శ్రీనివాస్ తో లవ్ స్టోరీనే చేయబోతున్నట్లు చెప్పాడు. ఇలా వరుసగా అందరూ ఒకేసారి లవ్ స్టోరీస్ బాట పట్టేశారు.
Tags:    

Similar News