స్టార్‌ కిడ్ బికినీ ట్రీట్ తో మతి పోగొట్టేస్తోంది

Update: 2022-02-03 12:30 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్ గారాల పట్టి సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సొంత ఇమేజ్ తో అవకాశాలు దక్కించుకునే స్థాయికి చేరుకుంది. హీరోయిన్ గా సైఫ్‌ అలీ ఖాన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చినా కూడా ఇప్పుడు తనకు తానుగా మంచి గుర్తింపును దక్కించుకుంది.

పెద్ద ఎత్తున అందాల ఆరబోస్తూ సోషల్‌ మీడియాలో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ను దక్కించుకుని టాప్ స్టార్‌ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌ లో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఆకట్టుకునే అందం తో పాటు నటన లో మంచి ప్రావిణ్యం ఉండటం ఇంకా డాన్స్ లో మంచి ప్రతిభ ను కనబర్చడం వల్ల ఈ అమ్మడికి టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు.

2018 సంవత్సరంలో హీరోయిన్‌ గా కేదార్‌ నాధ్‌ చిత్రంతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఏడాది సింబ సినిమాలో నటించి కమర్షియల్‌ గా బ్రేక్ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత వెను దిరిగి చూడకుండా కెరీర్‌ లో దూసుకు పోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల రెండేళ్ల పాటు ఈమె కు ఎక్కువగా ఆఫర్లు దక్కలేదు. వచ్చిన అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్‌ లో ముందుకు సాగుతుంది.

మళ్లీ సినిమాల జోరు మొదలు అయ్యింది కనుక ఇకపై ఏడాదికి మూడు నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడు చేసిన సినిమాలు అయిదు మాత్రమే. అయినా కూడా ఈ అమ్మడికి ఇంత గుర్తింపు స్టార్‌ డమ్‌ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆమె సోషల్‌ మీడియా షో అనడంలో సందేహం లేదు.

రెగ్యులర్ గా అందాలను ఆరబోస్తూ బికినీ షో తో కుర్రకారును రెచ్చగొట్టడం వల్లే ఈమెకు ఈ స్థాయిలో స్టార్‌ డమ్‌ దక్కింది. తాజాగా ఈ అమ్మడి బికిని ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. బికినీలో ఇప్పటి వరకు ఈ అమ్మడు పలు సందర్బాల్లో కనిపించింది. అయినా కూడా ఈ బికినీ ఫొటోలు ఆమె పై మరింతగా అభిమానం పెరిగేలా చేస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఒకప్పుడు హీరోయిన్‌ కాకముందు దాదాపుగా వంద కేజీల బరువు ఉన్న ఈ అమ్మడు పట్టుదలతో సినిమా లపై ఆసక్తితో ఏకంగా 40 కేజీల బరువు తగ్గింది. ఇప్పుడు ఈ అమ్మడి లుక్ మరియు ఇంతకు ముందు ఈమె లుక్ ను చూస్తే ఈమె పడ్డ కష్టం ఏంటి అనేది అర్థం అవుతుంది.


Tags:    

Similar News