ఎన్టీఆర్.. కొరటాల శివ కాంబోలో మూవీ పట్టాలెక్కబోతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ను ముగించిన ఎన్టీఆర్ ఏ క్షణంలో అయినా కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టవచ్చు అంటూ ఆమద్య వార్తలు వచ్చాయి. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో పట్టాలెక్కించేలా ప్లాన్స్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఈ సినిమా లో కొత్తగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. స్టూడెంట్ లీడర్ గా ఈ సినిమాలో ఎన్టీఆర్ ను కొరటాల శివ చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా లో ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా చూపించేందుకు గాను స్టార్ టెక్నీషియన్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ను రంగంలోకి దించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్30 కోసం రత్నవేల్ ను సంప్రదించడంతో పాటు దర్శకుడు కొరటాల శివ ఆయనతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించేలా చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ ను నటింపజేసే విషయమై చర్చలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా భారీ ఎత్తున అంచనాల నడుమ ఈ సినిమాను రూపొందిస్తున్న కొరటాల శివ టెక్నీషియన్స్ మరియు నటీ నటుల విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాడని సమాచారం అందుతోంది. అందుకే కాస్త ఎక్కువ బడ్జెట్ అవుతున్నా కూడా స్టార్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ఈమద్య కాలంలో రత్నవేల్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు వర్క్ చేశారు. అంతకు ముందు శంకర్ సినిమా రోబో.. సుకుమార్ సినిమా నేనొక్కడినే.. చిరంజీవి సినిమాలు ఖైదీ నెం.150 మరియు సైరా నరసింహా రెడ్డి లకు ఈయనే కెమెరా పట్టాడు. ఆ సినిమాల విజువల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెల్సిందే. భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలను ఈయన కెమెరాలో బంధించే విధానం అందరికి తెగ నచ్చుతుంది. అందుకే ఈయన ఎన్టీఆర్ 30 కి వర్క్ చేస్తున్నాడు అంటే అభిమానులు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రత్నవేల్ జాతీయ స్థాయి టెక్నీషియన్ అని.. పాన్ ఇండియా మూవీకి ఆయన సరిగ్గా సెట్ అవుతాడు అంటూ ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.