బ్రూస్‌ లీ దాడుల కథ!!!!

Update: 2015-10-15 22:30 GMT
ఇకపోతే ఇప్పుడు బ్రూస్‌ లీ రిలీజై పోతోంది అనే ఆనందంలో అభిమాను లైతే ఆ సినిమా దర్శకుడు, నిర్మాత, మ్యూజిక్‌ డైరక్టర్‌, డిస్ర్టి బ్యూటర్‌ మీద ఆదాయపన్ను శాఖ దాడులు జరిపింది అనే విషయం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదులే. అదే ''పులి'' టైపులో సినిమా ఆగుంటే మాత్రం.. ఇక్కడ రచ్చ రచ్చ అయిపోయేది. అయినాసరే కొందరు ఈ విషయంలో చాలా సందేహిస్తున్నారట.

నిజానికి ఓ రెండు క్యాంపులు బ్రూస్‌ లీ సినిమాను పోస్టుపోను చేయాల్సిందిగా కోరుకుంటున్నాయని.. మాటల యుద్దంతో పాటు.. ప్రెజర్‌ యుద్దం కూడా చేపట్టాయని.. అయినాసరే లొంగకపోతే తమ పలుకుబడి ఉపయోగించి ఆదాయ పన్ను శాఖతో దాడులు చేయించారని.. లాస్టు మినిట్‌ లో రామ్‌ చరణ్‌ అన్నీ సొంతంగా చూసుకోవడంతో.. దాడులు జరిగినా సినిమా రిలీజ్‌ అవుతోందని అంటున్నారు. అయితే ఇందులో ఏ మాత్రం నిజలేదేమో అనిపిస్తోంది.

ఒకవేళ సినిమాను ఆపు చేయడమే టార్గెట్‌ అయితే.. హీరో రామ్‌ చరణ్‌ మీద కూడా దాడులు జరిగేవి. ఎందుకంటే సినిమాకు సంబంధించి రిలీజ్‌ వ్యవహారాలు చరణే చూసుకుంటున్నాడని ఒక టాక్‌. లేదూ.. దాడులు కావాలనే చేయించారని అనుకుందాం. అసలు అందరూ ఎద్దేవా చేస్తున్న ఆ రెండు క్యాంపులకు కూడా ఇప్పుడు పొలిటికల్‌ పవర్‌ ఏ మాత్రం లేనే లేదు. వాళ్లు మద్దతిచ్చిన పార్టీలు కొన్ని అపోజిషన్‌ లో ఉంటే.. కొన్ని కనిపించకుండా పోయాయ్‌. సో.. ఆ ఆరోపణలు వట్టివే.

అయినా తెలుగు రాష్ట్రంలలో ఐటి శాఖ వారు.. సినిమా రిలీజ్‌ టైములో ప్రతీసారి పెద్ద నిర్మాతలపై దాడులు చేస్తూనే ఉన్నారు. గతంలో మహేష్‌ దూకుడు, ఆగడు నిర్మాతలపై.. అలాగే సీతమ్మ వాకిట్లో టైములో దిల్‌ రాజుపై.. ఈ దాడులు జరిగినవే. కాబట్టి ఇదో రెగ్యలుర్‌ ఎక్సరసైజుగానే చూస్తే బెటర్‌. ఆవేశపడి కొందరు అభిమానులు అర్ధంలేని స్టోరీలు ప్రచారం చేయడం వేస్ట్.
Tags:    

Similar News