ఊపిరి వెనుక అంత కథ ఉందా?

Update: 2016-03-18 09:30 GMT
ఊపిరి.. ‘ది ఇన్ చటబుల్స్’ అనే హాలీవుడ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు నాగార్జున, ఎన్టీఆర్‌ లను హీరోలుగా అనుకున్న సంగతీ తెలిసిందే. కార్తి చేసిన పాత్రను ఎన్టీఆరే చేయాల్సింది. అనుకోకుండా తారక్ సైడైపోయాడు.. కార్తి వచ్చాడు. ఐతే ఎన్టీఆరే తనకీ పాత్ర సూటవ్వదని పక్కకు తప్పుకున్నాడని.. కార్తి అతణ్ని రీప్లేస్ చేశాడని అంతా అనుకుంటున్నారు. కానీ అది వాస్తవం కాదంటున్నాడు నాగ్. ఆ సమయానికి డేట్లు కుదరకే ఎన్టీఆర్ ఆ పాత్ర చేయలేదని.. అసలు ‘ఊపిరి’ సినిమాను ముందు ఇనిషియేట్ చేసిందే తారక్ అని అంటున్నాడు.

వంశీ పైడిపల్లి ఓ కథ చెబుతాడు వినమంటూ తనకు ఫోన్ చేసి చెప్పిందే ఎన్టీఆర్ అని చెప్పాడు నాగ్. ఐతే ఈ కథ విన్నాక తన మీద కోప్పడకూడదని కూడా కండిషన్ పెట్టాడట ఎన్టీఆర్. చక్రాల కుర్చీకి అతుక్కుపోయే పాత్ర ఇచ్చారని ఫీలవుతారేమో అన్న ఉద్దేశంతో తారక్ ఆ మాట అన్నాడట. ఐతే ‘ది ఇన్ టచబుల్స్’ను రీమేక్ చేయబోతున్నారని తెలియగానే.. నాగ్ సంతోషంగా ఒప్పేసుకున్నాడట. ఐతే ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చే ప్రయత్నంలో నాగ్ పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టి.. ఓ హీరోయిన్, ఓ పాట కూడా ఉండేలా స్క్రిప్టు రాసుకొచ్చాడట వంశీ. ఐతే నాగార్జున మాత్రం ఒరిజినల్లో ఉన్నట్లుగా తీస్తేనే ఈ సినిమా చేస్తానని కండిషన్ పెట్టి.. తన ఇమేజ్ కోసం పాట, ఫ్లాష్ బ్యాక్ లాంటివేవీ వద్దని తేల్చి చెప్పాడట. దీంతో అవన్నీ పక్కనబెట్టి నాగ్ పాత్ర పూర్తిగా చక్రాల కుర్చీలోనే ఉండేట్లు స్క్రిప్టు మార్చాడట వంశీ. ఐతే నాగ్ దగ్గరికి వంశీని పంపించిన ఎన్టీఆర్ మాత్రం ఈ ప్రాజెక్టులో లేకుండా పోయాడు. డేట్లు అడ్జస్ట్ కాకపోవడం తప్ప దీనికి వేరే కారణం ఏదీ లేదని నాగ్ చెప్పాడు.
Tags:    

Similar News