కోలీవుడ్ హీరో ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర ఎల్.ఎల్.పి (SVCLLP) ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చింది. టాలీవుడ్ లో ధనుష్ మార్కెట్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. గతంతో పోలిస్తే మూడు నాలుగేళ్లుగా ఆయన చిత్రాలు తెలుగులో బాగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. `రఘువరన్ బిటెక్`- `విఐపీ` సహా పలు అనువాద చిత్రాలు ఆయన్ని టాలీవుడ్ ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యేలా చేసాయి. అటుపై ధనుష్ నటించిన సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం ధనుష్ కి కలిసొచ్చింది.
ఆ కాన్ఫిడెన్స్ తోనే టాలీవుడ్ హీరోలతో పోటీకి సై అనేస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల.. జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ ని ది బెస్ట్ గా మన పరిశ్రమలో లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తెలుగు- తమిళ్ నెటివిటీకి బాగా కనెక్టివిటీ ఉన్న స్క్రిప్ట్ నే ఎంపిక చేసుకున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. మధ్య తరగతి జీవితాల్లో చోటుచేసుకునే సాధారణ పరిస్థితులనే కథా వస్తువుగా మలుచుకున్నట్లు సమాచారం. తమిళ్- తెలుగు ప్రజల భావోద్వేగాలన్నింటిని కలిపి తనదైన శైలిలో ఆవిష్కరించనున్నారనే ప్రచారం ఇప్పుడు అంకంతకు హీటెక్కిస్తోంది. ఇక్కడ కమ్ముల ఓ కామన్ పాయింట్ తో మళ్లీ రెండు రాష్ట్రాల ప్రజల్ని కలిపే ఓ ప్రయత్నంలా కనిపిస్తోంది. అంటే తమిళనాడు తో ఆంధ్రా కనెక్టివిటీ ఈ కథలో ఉండే వీలుంటుంది. సోదర భావం లేదా విరోధం అనే ఎలిమెంట్స్ ని టచ్ చేస్తారని భావిస్తున్నారు.
ఇప్పటి తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. ఆంధ్రప్రదేశ్- తెలంగాణ అంటూ ప్రత్యేక రాష్ట్రాలు లేవు. పలు తిరుగుబాట్ల ఫలితంగా రాష్ట్రాలుగా.. ప్రాంతాలుగా ఏర్పాటయ్యాయి. అయితే కమ్ముల ఇప్పుడు ఈ డివైడ్ ప్యాక్టర్ ని కలిసి ఉన్నప్పుడు ఉండే తెలుగు-తమిళ ప్రజల మనోభావాల్ని ఇన్ బిల్డ్ చేసి కథగా మలుస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే స్క్రిప్ట్ పరంగా హై రేంజులో ఉన్నట్లే. ఇలాంటి కథల్ని.. ఎమోషన్స్ ని తెరకెక్కించడంలో చేయడం శేఖర్ కమ్ములకి కొట్టిన పిండి.. ఇప్పటికే బ్రీఫ్ గా స్క్రిప్ట్ వినిపించినట్లు సమాచారం. మరి ఇందులో వాస్తవాలు తేలాల్సి ఉంది. ప్రస్తుతం శేఖర్ కమ్ములా నాగచైతన్య హీరోగా తెరకెక్కించిన `లవ్ స్టోరీ` సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.