బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై రోజురోజుకు అనుమానాలు చెలరేగుతున్నాయి. కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ ది హత్య అని కుటుంబ సభ్యులు, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ముంబై పోలీసుల తీరుపై అనుమానాలున్నాయని రాజకీయ ప్రముఖులు ఆరోపించారు. సీబీఐ చేత ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
సుశాంత్ కేసులో ఇప్పటికే పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. విచారణను ఇంకా ప్రారంభించలేదు.
ఇక సుశాంత్ మృతిపై ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా మరిన్ని ప్రశ్నలు సంధించారు. ‘సుశాంత్ మరణించినప్పుడు రెండు అంబులెన్స్ లు ఎందుకు వచ్చాయి? ఎవరు ఫోన్ చేశారు?’ అంటూ కొత్త ప్రశ్నలు లేవనెత్తారు.
ఇక సుశాంత్ సర్వెంట్ గా ఉన్న శామ్యూల్ ఎందుకు మిస్ అయ్యారు? బతికి ఉన్నాడా? చనిపోయాడా? రెండో అంబులెన్స్ అతడి కోసమే వచ్చిందా?’ అని సుబ్రహ్మణ్యస్వామి ప్రశ్నలు కురిపించారు.
కాగా శామ్యూల్ బతికే ఉన్నాడని.. ఇటీవల ఓ చానెల్ లో ప్రత్యక్షమయ్యాడని ఓ నెటిజన్ సుబ్రహ్మణ్యస్వామికి వివరించారు.