మూడు కోట్ల దూరంలో సుబ్రమణ్యం

Update: 2015-10-06 13:30 GMT
తొలి సినిమా ‘పిల్లా నువ్వు లేని జీవితం’కే రూ.11 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసి ఓ స్థాయి అందుకున్నాడు సాయిధరమ్ తేజ్. ‘రేయ్’ సినిమాది స్పెషల్ కేస్ కాబట్టి దాన్ని పక్కనబెట్టేద్దాం. సాయి కొత్త సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అతడికి స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టేలాగే వసూళ్లు సాధిస్తోంది. సెకండ్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.16.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇంకో మూడు కోట్లు వసూలైతే ఈ సినిమా లాభాల బాటలోకి వచ్చేసినట్లే.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ వరల్డ్ వైడ్ బిజినెస్ రూ.18.5 కోట్ల దాకా జరిగింది. ప్రమోషన్, ప్రింట్లు ఇతర ఖర్చులన్నీ కూడా కలుపుకుంటే ఇంకో కోటి అవుతుంది. అంటే దగ్గర దగ్గర రూ.20 కోట్లు సంపాదిస్తే సుబ్రమణ్యం ఫర్ సేల్ హిట్ అనిపించుకుంటుంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో బయ్యర్లు బ్రేక్ ఈవెన్ కు వచ్చేశారు. ఫుల్ రన్ లో అందరూ పెట్టుబడి రాబట్టుకోవడం ఖాయమనే చెప్పాలి.

సుబ్రమణ్యం ఇప్పటిదాకా నైజాంలో రూ.5 కోట్లు - సీడెడ్లో 2.78 కోట్లు - రూ.6.5 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసింది. కర్ణాటక, ఓవర్సీస్ కలిపితే రూ.2.3 కోట్ల దాకా వచ్చాయి. రెండో వీకెండ్ లో వచ్చిన శివమ్ - పులి నిరాశ పరచడం ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు అడ్వాంటేజ్ అయింది. ఐతే ఈ సోమవారం నుంచి కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. శుక్రవారం ‘రుద్రమదేవి’ వస్తోంది కాబట్టి వీకెండ్ పై మరీ ఆశలు పెట్టుకోవడం కష్టమే. కాబట్టి ఎక్కువ లాభాలకైతే ఛాన్స్ లేదు.
Tags:    

Similar News