‘మెగా’ సినిమా.. 20 లక్షల మంది చూసేశారు

Update: 2016-01-06 17:30 GMT
కొన్ని సినిమాలు థియేటర్లలో పెద్దగా ఆడవు. కానీ బుల్లితెర మీదికి వచ్చేసరికి బంపర్ హిట్టయిపోతాయి. ‘ఖలేజా’ టైపు సినిమాలే అందుకు ఉదాహరణ. అలాగే కొన్ని సినిమాలు థియేటర్లలో ఫ్లాప్ అయి.. యూట్యూబ్ లోకి వచ్చి సూపర్ హిట్ అయిపోతుంటాయి. ‘రామయ్యా వస్తావయ్యా’నే తీసుకుంటే.. ఆ సినిమా డిజాస్టర్ టాక్ తో కొన్ని రోజుల్లోనే థియేటర్ల నుంచి మాయమైంది. కానీ యూట్యూబ్ లో విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటిదాకా ఆ సినిమాను 65 లక్షల మంది యూట్యూబులో చూడటం విశేషం. దీని గురించి చాలా గర్వంగా చెప్పుకున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్.

హరీష్ కొత్త సినిమా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ థియేటర్లలో ఏవరేజ్ గా ఆడింది. ఐతే దీనికి వచ్చిన టాక్ ప్రకారం ఇంకా పెద్ద హిట్టే అవుతుందనుకున్నారు కానీ.. అలా జరగలేదు. ఐతే ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ను డిసెంబరు 13న యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. సినిమా విడుదలైన రెండు మూడు నెలలకే యూట్యూబ్ లో ఫ్రీగా చూసే ఛాన్స్ దొరకడంతో జనాలు ఇక్కడ ఎగబడి ఆ సినిమాను చూసేస్తున్నారు. మూడు వారాల్లోనే సినిమాకు 20 లక్షల వ్యూస్ రావడం విశేషం. ఐతే యూట్యూబ్ వ్యూస్ ద్వారా కూడా ఆదాయం బాగానే వస్తుంది కాబట్టి.. నిర్మాత దిల్ రాజు ఖాతాలోకి ఇంకొంత డబ్బు వచ్చి పడుతున్నందుకు సంతోషమే.
Tags:    

Similar News