రజనీకాంత్, కమలహాసన్, సూర్య, విజయ్, అజిత్, కార్తి.. ఇలా చాలా మంది తమిళ హీరోలకు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. వీళ్ల ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉంది. ఈ తమిళ హీరోలంతా కోలీవుడ్‌తో పాటు తెలుగులోను తమ సినిమాలు విడుదల చేస్తుంటారు. అలా తమిళంతో పాటు తెలుగులోనూ తమ క్రేజ్‌ను, మార్కెట్ ను పెంచుకుంటున్నారు. తెలుగు వెర్షన్‌కు సంబంధించి తమ సినిమాల టీజర్లు, ట్రైలర్ల రిలీజ్ ఫంక్షన్స్‌లోనూ హైదరాబాద్ వచ్చి సందడి చేస్తుంటారు. అలా ఈ మధ్యలో స్ట్రైట్‌గా తెలుగు సినిమాలను చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలా రీసెంట్గా వంశీ పైడిపల్లితో విజయ్, వెంకీ అట్లూరీతో ధనుశ్ వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇక విషయానికొస్తే.. తమిళ స్టార్ హీరో ధనుష్ తొలి తెలుగు సినిమా సార్ ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.
ప్రీమియర్ షోస్ పాజిటివ్ టాక్ రావడం తో మొదటిరోజు రెగ్యులర్ షోస్ కు బాగా కలిసొచ్చింది. అలా ఏపీ తెలంగాణ కలిపి తొలి రోజు రూ. 2.65 కోట్ల షేర్ రూ.4.52 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యాయి. మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది. దీంతో ధనుష్‌కు తెలుగులో గ్రాండ్ వెల్కమ్ దక్కింది.
అయితే ధనుశ్‌తో పాటు మరి కొంతమంది తమిళ హీరోల సినిమాలు కూడా ఈ మధ్యలో విడుదలై మంచి వసూళ్లను అందుకున్నాయి. ఇటీవలే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన వారసుడు సంక్రాంతికి రిలీజ్ అయి రూ.3.19 కోట్లు కలెక్ట్ చేసింది. అంతకుముందు మొదట తమిళంలో ఆ తర్వాత కొన్ని రోజులకు తెలుగులో విడుదలైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్రదీవ్ రంగనాథన్ లవ్ టూడే కూడా మంచి వసూళ్లను అందుకుంది. ఈ చిత్రానికి తొలి రోజే.. రూ. 1.15 కోట్లు వచ్చాయి.
ఇక కమల్‌హాసన్ విక్రమ్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్లాక్ బస్టర్ అందుకుంది. అప్పటి వరకు ఫ్లాప్లోత సతమతమవుతున్న కమల్.. ఈ చిత్రంతో గట్టి కమ్ బ్యాక్ ఇచ్చారు. దీనికి తొలి రోజు రూ. 1.96 కోట్లు వచ్చాయి. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ ఫస్ట్ డే రూ. 2.88 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా అన్నింటికి తెలుగులో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వ్చచాయి. దీని బట్టి మన తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ తమిళ సినిమాలను, హీరోలను ఎప్పుడూ ఆదరిస్తారనే అర్థమవుతుంది. భవిష్యత్‌లో కూడా కోలీవుడ్ హీరోల ఇంకా మరిన్ని మంచి కథలతో వస్తే వారిని మనోళ్లు మరింతగా ఆదరిస్తారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.