టాలీవుడ్ స్టార్స్ అందరూ ఇతర ఇండస్ట్రీలలోని సినీ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యాన్ని కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. సందర్భం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఆత్మీయంగా మాట్లాడుకుంటుంటారు. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో భాషా ప్రాంతీయత హద్దులు చేరిగిపోయాయని అంటున్నాం కానీ.. నిజానికి ఎప్పటి నుంచో అన్ని భాషల హీరోల మధ్య ఫ్రెండ్ షిప్ ఉంది.
చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ - మోహన్ బాబు వంటి సూపర్ సీనియర్లు రజినీకాంత్ - కమల్ హాసన్ - మోహన్ లాల్ - మమ్ముట్టి - శివ రాజ్ కుమార్ - అమితాబ్ బచ్చన్ - సల్మాన్ ఖాన్ - అమీర్ ఖాన్ - సునీల్ శెట్టి వంటి ఇతర ఇండస్ట్రీలలోని స్టార్స్ తో స్నేహం కలిగి ఉన్నారు. ఆ తర్వాత జెనెరేషన్ హీరోలు సైతం ఇలాంటి రిలేషన్ నే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ప్రెజెంట్ జెనెరేషన్ లో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని - మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ మధ్య స్నేహం ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.
అక్కినేని నాగార్జున - మమ్ముట్టి వంటి సీనియర్ స్టార్ హీరోల వారసులైన అఖిల్ - దుల్కర్ ఎప్పటి నుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వయసు రీత్యా చాలా గ్యాప్ ఉన్నా ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. సందర్భం వచ్చినప్పుడల్లా కలుస్తూ ఉంటారు.. ఒకటి సినిమాకు మరొకటి సపోర్ట్ గా నిలుస్తూ ఉంటారు. బర్త్ డేలకు స్పెషల్ గా విషెస్ చెప్పుకుంటూ ఉంటారు.
అఖిల్ హీరోగా నటించిన 'మిస్టర్ మజ్ను' మూవీ ఓపెనింగ్ కు దుల్కర్ గెస్టుగా హాజరై బెస్ట్ విషెస్ అందజేసిన సంగతి తెలిసిందే. అలానే దుల్కర్ నటించిన '100 డేస్ ఆఫ్ లవ్' అనే సినిమా ప్రమోషన్స్ లో అక్కినేని హీరో పాల్గొన్నాడు. అలానే తమ సినిమాలకు సంబంధించిన టీజర్ - ట్రైలర్ రిలీజ్ అయినా.. సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఒకరినొకరు అభినందించుకుంటూ ఉంటారు.
హైదరాబాద్ హలీమ్ అంటే మహా ఇష్టపడే దుల్కర్ సల్మాన్ కు.. ప్రతి ఏడాది రంజాన్ టైమ్ లో స్పెషల్ హాలీమ్ ను ప్యాక్ చేసి పంపిస్తుంటారు అఖిల్. ఇండియాలో కాదు.. విదేశాల్లో ఉన్నా కూడా దుల్కర్ కు అఖిల్ నుంచి హలీమ్ అందుతుందని తెలుస్తుంది. స్టార్ వారసుల మధ్య అంత మంచి సాన్నిహిత్యం ఎలా కుదిరిందనేది అందరికీ ఆశ్చర్యకరంగా ఉంటుంది.
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మమ్ముట్టి భాగం అవ్వడానికి అఖిల్ - దుల్కర్ మధ్య ఉన్న స్నేహం కూడా ఒక కారణమనే టాక్ ఉంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ఈ స్పై థ్రిల్లర్ మలయాళ వెర్షన్ బాధ్యతను తండ్రీకొడుకులు తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు.
ఇకపోతే 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. అతను నటించిన 'కనులు కనులను దోచాయంటే' 'కురూప్' వంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'సీతా రామం' అనే సినిమాతో రాబోతున్నాడు దుల్కర్.
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'సీతా రామం' చిత్రాన్ని తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదల చేయబోతున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మ్యాజికల్ లవ్ స్టొరీతో టాలీవుడ్ లో పాగా వేయాలని దుల్కర్ ప్లాన్ చేసుకున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.