భలే మంచి రోజుతో సక్సెస్ సాధించిన మహేష్ బావ, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. ప్రస్తుతం బాలీవుడ్ మూవీతో బిజీగా ఉన్నాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న బాఘీ చిత్రంతో.. బాలీవుడ్ లో విలన్ గా అడుగు పెడుతున్నాదు సుధీర్.
ఫిజిక్ తో పాటు అనేక విషయాల్లో టైగర్ ష్రాఫ్ కి సమానంగా నిలవడం అసాధ్యం అంటున్నాడీ టాలీవుడ్ హీరో. ఏళ్ల తరబడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న టైగర్ కి.. పోటీగా నిలిచేందుకు తాను కూడా కొన్ని మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు చెబుతున్నాడు. చాలా సన్నివేశాల్లో టైగర్ తో టఫ్ కాంపిటీషన్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నట్లు చెప్పాడు సుధీర్ బాబు. ముఖ్యంగా కేరళ యుద్ధ కళ కళరియపట్టు నేర్చుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అసలు బాడీ - ఫిజిక్ - పర్సనాలిటీతో సహా.. ఇలా అనేక విషయాల్లో టైగర్ ష్రాఫ్ కి సమానంగా ఎదురు నిలబడగలిగే నటుడి కోసం.. బాఘీ యూనిట్ సెర్చింగ్ లో తనను ఎంపిక చేసుకున్నట్లు చెప్పాడు సుధీర్.
తన మొదటి సినిమా కోసం చేసిన షోరీల్ చూసి ఈ విలన్ పాత్రకు ఎంపిక చేశారని అన్నాడు. విలన్ రోల్ లో చేస్తున్నందుకు ఫీల్ అవడం లేదని.. ఇప్పటి యంగ్ జనరేషన్ అంతా.. హీరో - విలన్ కేరక్టర్ల విషయంలో వేరియషన్ చూడ్డం లేదనే విషయాన్ని గుర్తు చేశాడు. ఇప్పుడున్న స్టార్లలో చాలామంది ఇలా విలన్ నుంచి హీరోగా టర్న్ అయిన వాళ్లే అని గుర్తు చేసిన సుధీర్.. ఓ ఇండస్ట్రీలో హీరోగా ఉంటూ మరో ఇండస్ట్రీలో విలన్ గా చేయడం తనకు దక్కిన ఓ అపూర్వ అవకాశంగా చెప్పాడు. టాలీవుడ్ మూవీ వర్షంకి రీమేక్ అని భావిస్తున్న భాఘీ హిట్ అయితే.. సుధీర్ బాబు బాలీవుడ్ లోనూ సెట్ అయిపోతాడనే అంచనాలున్నాయి.