హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మహేష్ బావ సుధీర్ బాబు. ఐతే ఇప్పటిదాకా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. కెరీర్ లో బాగా ఆడిన ‘ప్రేమకథా చిత్రమ్’కు పేరు రాలేదు. బాగా పేరొచ్చిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ సినిమా ఆడలేదు. మిగతా సినిమాలు రెండు రకాలుగానూ నిరాశ పరిచాయి. ఐతే సినిమాలు ఎలా ఆడినా సుధీర్ సినిమా సినిమాకు మెరుగవడానికి ప్రయత్నిస్తుండటం.. ఎంతో కష్టపడుతుండటం తెలుస్తూనే ఉంది. తన బాడీని అతను ఎంత బాగా మలుచుకున్నాడో.. యాక్టింగ్ - డిక్షన్ విషయంలోనూ మెరుగవడానికి ఎలా కష్టపడుతున్నాడో అతడి సినిమాలు చూస్తేనే అర్థమవుతోంది.
తెలుగు సినిమాలకే అంతగా కష్టపడిన సుధీర్.. ఇక బాలీవుడ్ సినిమా అనేసరికి ఇంకా ఎక్కువ శ్రమిస్తున్నాడు. ‘భాగి’ అనే సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తున్న సుధీర్.. ఇందులో యాక్షన్ సన్నివేశాల కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఫైటర్లతో కలిసి ట్రైనింగ్ చేస్తున్న వీడియో ఒకటి రీసెంట్ గా ట్విట్టర్ లో షేర్ చేశాడు సుధీర్. అది చూస్తే స్టన్ అయిపోవడం ఖాయం. ప్రాక్టీస్ లోనే ఇంత బాగా చేస్తున్నాడంటే సినిమాలో ఇంకెంత బాగా చేస్తాడో అనిపిస్తోంది ఈ వీడియో చూస్తుంటే. రోజూ గంటల తరబడి ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఒళ్లు హూనమైపోతోందని.. ఐతే ఈ నొప్పుల నుంచి బయటపడ్డానికి బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ నేర్పించిన ఐస్ బాత్ చిట్కా తనకు తెలుసని అంటున్నాడు సుధీర్.