ఇటీవలి కాలంలో సౌత్ సినిమాలో చిత్ర విచిత్రమైన సినిమాలొస్తున్నాయి. వీటిలో కాన్ డ్రామా అనేది ఒకటి. అదే ఓ మోసగాడైన హీరో స్టోరీ అనమాట. వింతైన క్యారెక్టరైజేషన్ తో ఆద్యంతం వినోదాత్మకంగా సాగే సినిమాలివి. క్యారెక్టర్ బిహేవియర్ లో కన్ఫ్యూజన్ తో కూడిన రక్తి కట్టించే డ్రామా ఉంటుంది. ఇలాంటివి తెలుగులోనూ వచ్చాయి. కానీ ఇంకా రికగ్నిషన్ రాలేదు. ఆ జోనర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిందేం లేదు. ఇటీవలే సిద్ధార్థ్ తమిళ్లో ఈ తరహా మూవీలోనే నటించాడు. టీజర్ కూడా రక్తి కట్టించింది. త్వరలోనే తెలుగులో రిలీజ్ కానుంది. అయితే ఇప్పుడు అలాంటి ఓ వెరైటీ క్యారెక్టరైజేషన్ లో నటించేందుకు రవితేజ రెడీ అవుతున్నాడన్నది తాజా అప్ డేట్.
స్వామిరారా ఫేం సుధీర్ వర్మ రవితేజకు ఓ కథ చెప్పాడు. ఈ ఇద్దరి కలయికలో సినిమా ఉంటుందని వార్తలొచ్చాయి. అయితే అది ఫైనల్ అయ్యిందన్న కన్ఫర్మేషన్ న్యూస్ మాత్రం లేనేలేదు. కానీ ఈ ఇద్దరి కలయికలో సినిమా సెట్స్ కెళ్లే సందర్భం వచ్చిందని చెబుతున్నారు. రవితేజ ప్రస్తుతం దిల్‌రాజు నిర్మిస్తున్న ఎవడో ఒకడు చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తవ్వగానే సుధీర్ వర్మతో సినిమా ఉంటుంది. ప్రతిసారీ రొటీన్ మాస్ మూస యాక్షన్ సినిమాల్లో నటిస్తున్న రవితేజకి ఇదో ఎక్స్ పెరిమెంట్ లాంటిదే. అతడిలోంచి కొత్త కోణాన్ని ఆవిష్కరించే బాధ్యత సుధీర్ తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. సుధీర్ వర్మ తెరకెక్కించిన స్వామిరారా - దోచెయ్ సినిమాలు స్టయిలిష్ కామెడీ ఎంటర్ టైనర్స్. ఇప్పుడు కాన్ డ్రామా అంతకంటే స్టయిలిష్ గా, ఫన్నీగా ఉంటుందని చెబుతున్నారు.కథ - కంటెంట్ నచ్చడం వల్లే రవితేజ ఓకే చేశాడని చెప్పుకుంటున్నారు. అదీ మ్యాటరు.