మిర్ర‌ర్ సెల్పీ లో సుహానా సో క్యూట్!

Update: 2022-08-04 05:39 GMT
బాద్ షా షారుక్ ఖాన్ ముద్దుల త‌న‌య ముఖానికి మేక‌ప్ వేసుకోవ‌డానికి ముందే సోష‌ల్ మీడియాలో ఫేమ‌స్ సెల‌బ్రిటీగా ఫేమ‌స్. అమ్మ‌డి ఇన్ స్టా ఖాతా ఫాలోవ‌ర్స్  మూడు మిలిన్స్ కి పైగానే ఉంది.  షారుక్ త‌నయ అన్న గుర్తింపు..సోష‌ల్ మీడియాలో బ్యూటీ యాక్టివిటీ కార‌ణంగా ఓ సెన్షేష‌న్ అయింది. ఎప్పటిక‌ప్పుడు హీటెక్కించే ఫోటోల‌తో నెటి జ‌నుల్ని హీటెక్కించ‌డం అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌.

తాజాగా బ్యూటీ మిర్ర‌ర్ సెల్పీతో ముందుకొచ్చేంది. ఇదిగో ఇక్క‌డిలా చేతిలో స్మార్ట్ ఫోన్ తో మిర్ర‌ర్ సెల్పీ దిగింది. క్యూట్ లుక్ తో ఆక‌ట్టుకుంటుంది. న‌లుపు రంగు క్యాజువ‌ల్స్ లో  సింపుల్ ఫోజులో సో క్యూట్ అనిపిస్తుంది.  నెక్ పై స‌న్న‌ని చైన్ బ్యూటీ అందానికి మ‌రింత వన్నె తీసుకొచ్చింది. చార‌డేసి క‌ళ్లు..షారుక్ ని పోలిన ఆ నోస్.. అంద‌మైన పెదాలు సుహానా లో బ్యూటీని మ‌రింత  హైలైట్ చేస్తున్నాయి.

ఈ ఫోటోని ఉద్దేశించి సుహానా  `నాతో సిద్దంగా ఉండండి` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్  గా మారింది.

బాలీవుడ్ సెల‌బ్రిటీలు..కామెంట్లు..ఎమోజీలు పోస్టులు..లైక్ ల‌తో మ‌రింత మైలేజ్ వ‌స్తుంది. ఖుషీ  క‌పూర్ `క్యూట్` అని రాయ‌గా..శాన‌య్య క‌పూర్ `సూ` అని ఐల‌వ్ సింబ‌ల్ పోస్ట్ చేసింది. అలాగే `లైగ‌ర్` బ్యూటీ అన‌న్య పాండే `బాంబి` అని అడ‌వి దుప్పి ఎమోజీని పోస్ట్ చేసింది. ఇప్ప‌టికే ఈ ఫోటోకి ఐదు లక్ష‌ల‌కు పైగా లైకులొచ్చాయి.

ఇక సుహానా బాలీవుడ్ డెబ్యూ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. `ది అర్చీస్` తో ముందుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంది. జోయా అక్త‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సుహానాతో పాటు బాలీవుడ్ నట వారసులు ఎంట్రీ ఇస్తున్నారు.  అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా.. బోనీకపూర్ వారసురాలు దివంగత శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ లు ఒకే సారి బీ టౌన్ లో ఎంట్రీ  ఇవ్వ‌డం విశేషం.   `ది ఆర్చీస్‌` అమెరికన్‌ కామిక్‌ సిరీస్‌.
Tags:    

Similar News