సుహాసిని మణిరత్నం.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. అలనాటి మేటి నాయికగా అందరికీ తెలుసు. ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం భార్యగా, ఓ బిడ్డకు తల్లిగా కుటుంబ బాధ్యతల్ని నిర్వహిస్తూనే, మరోవైపు మద్రాస్ టాకీస్ బ్యానర్ లో ఎన్నో సినిమాల్ని నిర్మించారు. సుహాసిని ప్రస్తుతం 'లవ్ 24/7' అనే మలయాళ చిత్రంలో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కి రానుంది. ఫ్యామిలీ కమిట్ మెంట్స్ అన్నీ వదిలేసి కేరళలో షూటింగులో పాల్గొన్నా. ఈ చిత్రంలో కాన్సెప్టు నచ్చింది. 20నిమిషాల నిడివితో నా క్యారెక్టర్ ఉంటుంది.. అని సుహాసిని చెప్పారు.
అంతేకాదు ఈరోజు నటిగా కొనసాగుతున్నానంటే ఆ రోజుల్లో నేను తీసుకున్న డేర్ డెసిషన్ వల్లేనని ఓమారు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లారు. నిజానికి నేను సినిమాటోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించాను. నాన్న చారుహాసన్ ఓ నటుడుగా కొనసాగుతున్న రోజుల్లో నేను పబ్లిక్ లో డ్యాన్సులు చేస్తానంటే ఊరుకునేవారు కాదు. కానీ నాన్నలో అనూహ్య మార్పు. నేను నటనలోకి రావాలని కోరుకున్నారు. కానీ అంకుల్ కమల్ హాసన్ మాత్రం అందుకు ససేమిరా అన్నారు. అస్సలు ఒప్పుకోలేదు.
నేను సినిమాటోగ్రాఫర్ నే కావాలనేది అంకుల్ కమల్ హాసన్ కోరిక. కానీ నేను డేర్ చేసి నటి అయ్యాను. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం వల్లే హీరోయిన్ గా ఎదిగానని సుహాసిని చెప్పారు. సినిమాటోగ్రఫీ వదిలేసి నటి అవ్వడాన్ని ఆ తర్వాత కమల్ హాసన్ కూడా స్వాగతించారని సుహాసిని చెప్పారు. ఇంతకథ ఉందన్నమాట!