షార్ట్ ఫిలిం కష్టాలు చెప్పుకొచ్చిన సుజిత్

Update: 2019-09-03 04:30 GMT
ప్రస్తుతం సాహో థియేటర్స్ లో సందడి చేస్తుంది. టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది. ప్రభాస్ క్రేజ్ తో బాలీవుడ్ లోనూ సినిమా ముందుకెళ్తుంది. అయితే మొదటి రోజు నుండి నెటీజర్లు ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సుజిత్ ని ట్రోల్ చేస్తూ వస్తున్నారు. లేటెస్ట్ 'సాహో' కి వచ్చిన టాక్ పై స్పందించాడు సుజిత్. ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన మనసులో మాటలను బయట పెట్టాడు.

17 ఏళ్ళ వయసులో ఒక షార్ట్ ఫిలిం తీసాను. ఆ సమయంలో నా దగ్గర డబ్బు తో పాటు టీమ్ కూడా లేదు. అయినా ఆర్కుట్ నుండి ఫ్యామిలీ నుండి సపోర్ట్ లభించింది. నా షార్ట్ ఫిలిమ్స్ ను 90 శాతం నేనే షూట్ చేసుకొని ఎడిట్ చేసుకునేవాణ్ణి. ఆ టైం లో నేను చేసిన మిస్టేక్స్ నుండి క్రిటిసిజం నుండి చాలా నేర్చుకున్నాను. అవి నా జర్నీ కి ఒక బూస్టప్ లా నిలిచాయి.నా జర్నీ లో ఎన్నో ఇబ్బందులు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పుడు ఎంతో మంది 'సాహో' చూసారు. ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చారు. కానీ చాలా మందికి నచ్చింది. థాంక్స్ టూ ఆల్ ఫర్ వాచింగ్ ది మూవీ. ఏదైనా మిస్సయింది అనుకునే వాళ్ళు మళ్లీ సినిమాను చూడండి. ఈసారి కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అని పేర్కొన్నాడు.

ఇక సుజిత్ పెట్టిన ఈ పోస్ట్ కి కింద అందరూ కామెంట్ల తో సపోర్ట్ చేస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ సుజిత్ గాడ్ బ్లెస్ యూ. నువ్వొక జెమ్ అంటూ మెచ్చుకున్నాడు. సినిమా ఎవ్వరినీ డిసపాయింట్ చేయలేదు అని పేర్కొన్నాడు. ఇక 17 ఏళ్ల వయసులో సుజిత్ కష్టానికి అందరూ సాహో అంటూ మెచ్చుకుంటున్నారు. ఏదేమైనా తన కష్టాల గురించి చెప్తూ సపోర్ట్ చేయమని అడుగుతూ 'సాహో' ని రెండో సారి చూడమని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ డైరెక్టర్.



Tags:    

Similar News