సుకుమార్ తొలి సినిమా ‘ఆర్య’లో అల్లు అర్జున్ హీరో అన్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఆ కథను తొలిసారి బన్నీకే వినిపించి.. అతడితోనే సినిమా తీశాడని అనుకంటున్నారంతా. కానీ ఆ కథను బన్నీ కంటే ముందు నితిన్ కు చెప్పాడట సుకుమార్. ఈ సీక్రెట్ ఇప్పుడే రివీల్ చేశాడు సుకుమార్. నితిన్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో నటించిన ‘దిల్’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్ అని.. అప్పట్నుంచే నితిన్ తో తనకు మంచి స్నేహం ఉందని.. ఆ సినిమా షూటింగ్ అవ్వగానే తామిద్దరం స్నేహితుల్లాగా గడిపేవాళ్లమని.. అలా ‘ఆర్య’ సినిమా కథను ముందుగా నితిన్ కే వినిపించానని సుకుమార్ తెలిపాడు.
నితిన్ కు వినిపించే సమయానికి ‘ఆర్య’ కథ పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదని.. రఫ్ గా కథ అతడికి వినిపించానని.. ఆ రకంగా చూస్తే తన తొలి కథానాయకుడు నితినే అని సుకుమార్ అన్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘జానీ’ ఫ్లాప్ అయినపుడు నితిన్ ఎంత బాధపడ్డాడో.. ఎలా ఏడ్చాడో తనకు తెలుసని సుకుమార్ వెల్లడించాడు. నితిన్ ను రఫ్ గా చూడాలని.. డిఫరెంట్ గెటప్ లో చూడాలని తనకు కోరిక ఉండేదని.. ‘లై’ సినిమాలో అతణ్ని చూస్తే సరిగ్గా అలాగే కనిపిస్తున్నాడని సుకుమార్ అన్నాడు. ‘లై’ నిర్మాతలు అనిల్ సుంకర-రామ్-గోపీనాథ్ ల గురించి సుకుమార్ చెబుతూ.. ‘1 నేనొక్కడినే’ చేసేటపుడు తాను వాళ్ల ప్యాషన్ చూశానని.. అలాగే ఆ సినిమా వాళ్ల వాళ్ల లాస్ కూడా చూశానని.. అయినప్పటికీ ఏమాత్రం రాజీ పడకుండా ఆ తర్వాత కూడా అదే ప్యాషన్ తో సినిమాలు తీస్తున్నారని.. వాళ్ల కోసం ‘లై’ బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నానని సుకుమార్ వెల్లడించాడు.