ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే 'పుష్ప'కి వచ్చినంత క్రేజ్ మరే సినిమాకి కూడా రాలేదు. కథా నేపథ్యం .. పాత్రలను మలిచిన తీరు .. సంగీతం .. ఫైట్స్ .. ఇలా అన్నీ కూడా ఈ సినిమాపై అంచనాలను పెంచేస్తూ వెళుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీన వివిధ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి నిర్వహించారు. వందలాదిమంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ స్టేజ్ పై ఈ సినిమా దర్శకుడు సుకుమార్ కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గౌరవ అతిథులుగా వచ్చిన రాజమౌళి, సుకుమార్ ఈ సినిమా పనులతో ముంబైలో బిజీగా ఉన్నాడని చెప్పారు. సినిమా అద్భుతంగా వస్తుందనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇక కొరటాల .. తాను మాట్లాడేవన్నీ సుకుమార్ మాటలు అంటూ ఒక కొత్త పద్ధతికి తెరతీశారు.
కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ కొరటాల మాటలు .. ఎక్కడి నుంచి సుకుమార్ మాటలు అనుకోవాలనే విషయంలో కొంత అయోమయం మాత్రం తప్పడం లేదు. తన మాటలేవో తాను మాట్లాడేస్తే బాగుండేదనే అభిప్రాయాలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి.
కొరటాల కూడా సుకుమార్ 'పుష్ప' సినిమా పనులతో బిజీగా ఉండటం వలన రాలేదనే చెప్పాడు. అటు రాజమౌళి .. ఇటు కొరటాల చెప్పారు గనుక, అక్కడికి వచ్చిన అభిమానులెవరికీ ఎలాంటి సందేహం తలెత్తలేదు.
ఆ విషయాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు కూడా. నిజంగానే మరి .. ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడేమో రిలీజ్ డేట్ దగ్గర పడింది. ఇప్పుడు సమయం చాలా విలువైనది కావడం వలన రాకపోయి ఉండొచ్చని అంతా అనుకున్నారు.
అయితే సుకుమార్ రావడం లేదనే విషయం తనకి ఆ సాయంత్రం వరకూ తెలియదన్నట్టుగా అల్లు అర్జున్ మాట్లాడాడు. "ఆయన లేకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి .. నేను కన్వీన్స్ చేస్తాను .. డిస్కర్షన్ లేదు .. వస్తాడంతే" అనుకుని తాను కాల్ చేసినట్టు చెప్పాడు.
సుకుమార్ రాలేనంత బిజీగా ఉన్నాడని తెలిసినప్పుడు బన్నీ ఎలా కాల్ చేస్తాడు? ఒక ప్రణాళిక ప్రకారం వర్క్ జరుగుతున్నప్పుడు, సుకుమార్ వస్తాడని సాయంత్రం వరకూ బన్నీ అనుకోవడం ఏమిటి? ఇదిగో ఇప్పుడు ఈ సందేహాలపైనే చర్చలు నడుస్తున్నాయి. సుకుమార్ .. నేను వేరు కాదు, ఆయన నేను ఒకటే అనే స్పష్టతను ఇవ్వడానికి బన్నీ ప్రయత్నించడం కూడా చర్చల్లో భాగమైపోయింది.