సుక్కూ వెరీ నేచురల్.. అంతకుమించి వెరీ డౌన్ టు ఎర్త్... లుక్కు పరంగా అస్సలు ప్రయోగాలకు పోడు. ఇతరులతో పోలిస్తే ఎంతో సెన్సిటివ్ గా సింపుల్ గా కనిపించే సుక్కూలో ఏంటీ మార్పు?
ప్రతిసారీ తన హీరోలను హింసించి అయినా కొత్త లుక్ లో చూపించేందుకు తపించే సుకుమార్ అలియాస్ సుక్కూ బన్నీతో చాలా ప్రయోగాలు చేసాడు. ఆర్య గా.. పుష్పరాజ్ గా అతడిని రగ్గ్ డ్ పాత్రలో అద్భుతంగా ఆవిష్కరించాడు. అంతకుముందు రామ్ చరణ్ ని రంగస్థలం చిట్టిబాబుగా ఆవిష్కరించిన తీరును మెగాభిమానులు ఎప్పటికీ మర్చిపోరు.
చూస్తుంటే ఇప్పుడు సుక్కూ కూడా తన హీరోల మాదిరిగా కొత్త లుక్ లోకి మారి షాకిచ్చాడు. అతడు దుబాయ్ ఎడారిలో కేజీఎఫ్ డాన్ లా దిగాడు. అక్కడ చిద్విలాసంగా సమయాన్ని గడుపుతూ ఆస్వాధనలో ఉన్నాడు. అయితే అతడు కుటుంబంతో కలిసి దుబాయ్ లో విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫోటోలు ఇప్పుడు తెలుగు మీడియాతో పాటు హిందీ మీడియాలోను వైరల్ గా మారుతున్నాయి. నిజానికి పుష్ప చిత్రంతో సుకుమార్ పేరు ఉత్తరాదినా మార్మోగింది. ఎవరీ మాంత్రికుడు అంటూ అక్కడ క్రిటిక్స్ పుష్ప చిత్రాన్ని తెగ పొగిడేశారు. అందుకు తగ్గట్టే ఇప్పుడు సుక్కూ లుక్కు కూడా మారింది.
టాప్ టు బాటమ్ అతడు బ్లాక్ అండ్ బ్లాక్ లుక్ లో కనిపించిన సుకుమార్ బ్లాక్ ట్రాక్.. కాంబినేషన్ టీషర్ట్.. ఆ పైన బ్లాక్ కోట్ తో నిజంగానే డాన్ ని తలపించాడు. పైగా గుబురుగా ఎదిగిన ఆ పండు గడ్డం చూడగానే కేజీఎఫ్ విలన్లకే బాప్ లా కనిపించాడు. నిజానికి సుకుమార్ ని ఇన్నేళ్లలో ఎపుడూ పెద్ద తెరపై అభిమానులు చూడలేదు. ఇలా మెరిసి అలా వెళ్లేందుకు కూడా అతడు పెద్దగా ఆసక్తి చూపించింది లేదు. కానీ ఇప్పుడు అతడు నటించేందుకు కూడా ప్రిపేరైతేనే మంచిదని అభిమానులు కోరుకుంటున్నారు.
అంతగా సుక్కూ రూపం మారిపోయింది. ఇలాంటి ఒక కొత్త లుక్ తో అతడు విలనీ చేసినా అభిమానులకు అభ్యంతరమైతే లేదు. అయితే అంతకంటే ముందే పుష్ప 2 చిత్రంతో బన్నీని పాన్ వరల్డ్ స్టార్ గా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సుకుమార్ తో పాటు ఈ విహార యాత్రలో తన భార్యామణి.. ఇద్దరు కిడ్స్ కూడా జాలీ యాత్రలో కనిపిస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన తదుపరి పాన్-ఇండియన్ సీక్వెల్ మూవీ 'పుష్ప: ది రూల్' చిత్రీకరణను ఇప్పటికే ప్రారంభించిన తర్వాత చిన్న గ్యాప్ లో తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి విహారయాత్రకు వెళ్లాడు. సుకుమార్ భార్య తబిత తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో దుబాయ్ నుంచి తమ ఫ్యామిలీ ఫోటోని షేర్ చేసారు. అందులో సుకుమార్ తన భార్య- కొడుకు - కుమార్తెతో ఎడారిలో నడుస్తూ కనిపించారు. ఈ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే యాత్రను ముగించి హైదరాబాద్ కు తిరిగి వచ్చి అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ ను మళ్లీ ప్రారంభిస్తారని తెలిసింది. రణానికి వెళ్లే ముందు రిలాక్స్ టైమ్ ఇది. పుష్పరాజ్ అనే ప్రమాదకర గంధపు చెక్కల స్మగ్లర్ తో కుస్తీలు పట్టించాలంటే ఈమాత్రం రిలాక్స్ ట్రీట్ అతడికి చాలా అవసరం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.