మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెరకెక్కించిన భారీ చిత్రం 'రంగస్థలం'. మైత్రీ మూవీమేకర్స్ సంస్థ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ సుకుమార్ సినిమాల్లో భిన్నమైన సినిమాగా నిలవడమే కాకుండా ఆయనకు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ని అందించి దర్శకుడిగా ఆయన గమనాన్ని మార్చింది. ఇంటలిజెన్సీ వున్న కథలపై వర్కవుట్ చేస్తూ వెళుతున్న సుకుమార్ కు 'రంగస్థలం' కొత్త మార్గాన్ని కొత్త పంథాని పరిచయం చేసింది.
ఈ మూవీ అందించిన సక్సెస్ స్ఫూర్తితో సుకుమార్ చేసిన మరో మాసీవ్ ఎంటర్ టైనర్ 'పుష్ప'. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో భారీ వసూళ్లని రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ లో వసూళ్ల పరంగా షాకిచ్చింది. అక్కడ ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లని రాబట్టింది. త్వరలోనే దీనికి సీక్వెల్ గా 'పుష్ప 2'ని చేయడానికి రెడీ అవుతున్నారు సుకుమార్. అయితే 'రంగస్థలం' సక్సెస్ స్ఫూర్తితో పీరియాడిక్ కథలపై కన్నేసిన సుకుమార్ తెలంగాణ సాయుధ పోరాటం కాలం నాటి రజాకార్ల కథతో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టాలనుకున్నారు.
ఈ క్రేజీ పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్ట్ కోసం హీరోగా విజయ్ దేవరకొండని ఎంచుకున్నారు. అల్లు అర్జున్ మిత్రుడు ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ మూవీని బిగ్గర్ ప్రాజెక్ట్ గా తెరపైకి తీసుకురానున్నామని ప్రకటించారు. ఈ సినిమా కోసం రజకార్ కాలం నాటి తెలంగాణ చరిత్రపై సుకుమార్ అధ్యయనం చేశారు కూడా. కథలో తెరపైకి తీసుకురాదగ్గ స్టఫ్ చాలా వుందని గ్రహించిన సుకుమార్ ఆ కాలం నాటి ఓ యోధుని కథగా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలనుకున్నారు.
ఇప్పటికే 'రాజన్న' లాంటి సినిమా రజాకార్ల నాటి కథతో రూపొందినా అందులో పూర్తి స్థాయిలో ఆ కాలం నాటి పరిస్థితుల్ని చూపించలేకపోయారు. కేవలం ఓ పాప నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కించారు. అయితే సుకుమార్ మాత్రం రజాకార్ల నాటి తెలంగాణ ఎలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంది? ఆ నాటి పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారెవరు? వంటి ఆసక్తికరమైన కథ, కథనాలతో సినిమా చేయాలని ఫిక్సయ్యారట.
సినిమా ప్రకటించి ఏడాది దాటినా ఈ ప్రాజెక్ట్ పై ఇంత వరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వడం లేదు. మధ్యలో ఈ సినిమా ఖచ్చితంగా వుంటుందని, సుకుమార్ ఫ్రీ అయ్యాక ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తారని మేకర్స్ వివరణ ఇచ్చారు. ప్రకటన ఇచ్చి కూడా ఏడాది దాటింది. విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ 'పుష్ప 2' కోసం రెడీ అవుతున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో ప్రాజెక్ట్ ఉన్నట్టా? లేనట్టా అనే చర్చ మొదలైంది.
పాన్ ఇండియా మూవీస్ కు ఆదరణ లభిస్తున్న వేళ విజయ్ - సుకుమార్ ల సినిమాకు ఇదే రైట్ టైమ్ అని అంతా భావిస్తున్నారు. 'పుష్ప 2' తరువాతైనా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేనా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం 'పుష్ప 2' తరువాత సుకుమార్ ఈ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కిస్తాడని చెబుతున్నాయి.