అల్లు అర్జున్‌ ని మించిపోయాడా?

Update: 2016-08-15 09:30 GMT
త‌న మూడో సినిమాకే అన్న అల్లు అర్జున్‌ ని మించిపోయాడ‌ట అల్లు శిరీష్‌. ఈ మాట వేరెవ‌రో చెప్పింటే లైట్‌ గా తీసుకోవ‌చ్చు. సాక్షాత్తు అల్లు అర్జున్‌ తో సినిమాలు చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్ నోటి నుంచే ఆ మాట వ‌చ్చింది. అందుకే ఆ మాట‌లు ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీశాయి.  ఇంత‌కీ ఏ విష‌యంలో అన్న‌ని త‌మ్ముడు  మించిపోయాడా తెలుసా?  కామెడీ చేయ‌డంలో.  `శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు` చూశాక సుకుమార్‌ కి అల్లు శిరీష్ కామెడీ టైమింగ్‌ - ఆయ‌న వాయిస్ చాలా బాగా న‌చ్చింద‌ట‌.  అల్లు అర్జున్‌ లోనూ ఇంత టైమింగ్ క‌నిపించ‌లేదని సుకుమార్ నిన్న జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో చెప్పుకొచ్చాడు. ఈ విష‌యాన్ని ఆ కార్య‌క్ర‌మంలోనే కాదు,  నేరుగా అల్లు అర్జున్‌ కి కూడా చెప్పాడ‌ట‌. ఆ మాటలు విన్న అల్లు శిరీష్ ఆనందానికి అవ‌ధుల్లేవు. మొద‌ట్నుంచీ శిరీష్ ``నా బ‌లం కామెడీ - శ్రీర‌స్తు శుభ‌మ‌స్తులో మంచి కామెడీ పండించాన‌``ని చెబుతున్నాడు. ఇప్పుడు ఆ విష‌యంలోనే అంద‌రూ ప్ర‌శంసిస్తుండ‌డం ఆయ‌న‌కి కొత్త ఉత్సాహాన్నిచ్చింది.

అయితే సుకుమార్ బ‌న్నీకంటే బెట‌ర్ అని పొగ‌డ‌మే కొద్దిమంది మ‌రీ టూ మ‌చ్ అంటున్నారు. బన్నీ ప‌న్నెండేళ్లుగా క‌థానాయ‌కుడిగా కొన‌సాగుతున్నాడు. త్రివిక్ర‌మ్‌ లాంటి అగ్ర ద‌ర్శ‌కుల‌తోనూ సినిమాలు చేసి ప్రేక్ష‌కుల్ని అల‌రించాడు. అలాంటి క‌థానాయ‌కుడికంటే శిరీష్ బెటర్ అని పొగ‌డ‌టం మ‌రీ కృత‌కంగా అనిపిస్తోంద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News