సునీల్ కొత్త సినిమా ‘ఉంగరాల రాంబాబు’ గత నెలే విడుదలైపోయింది కదా.. ఇక సునీల్ నాగార్జునతో ఢీకొట్టడమేంటి అంటారా? ఇక్కడ మాట్లాడుతోంది కమెడియన్ టర్న్ డ్ హీరో సునీల్ గురించి కాదులెండి. దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గురించి. సొంతఊరు.. గంగపుత్రులు.. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి రియలిస్టిక్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక శైలి ఏర్పరుచుకున్న సునీల్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు ‘గల్ఫ్’ అనే సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. కొన్నాళ్ల కిందట అగ్ర దర్శకుడు సుకుమార్ ఈ చిత్ర ప్రమోషన్లలో కూడా పాల్గొన్నాడు. ఈ సినిమాను ఉన్నట్లుండి విడుదలకు సిద్ధం చేసేశారు.
నాగ్ సినిమా ‘రాజు గారి గది-2’ విడుదలవుతున్న 13వ తారీఖునే ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. వచ్చే వారాంతానికి ‘రాజు గారి గది-2’ మినహా మరే సినిమా విడుదల కావట్లేదు కాబట్టి తమకు ఓ మోస్తరుగా థియేటర్లు దొరుకుతాయని.. ‘రాజు గారి గది-2’ ఓవర్ ఫ్లోస్ కూడా కొంచెం కలిసొస్తాయని ఆ రోజునే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్ణయించారు. ఇంతకుముందు ‘సొంత ఊరు’లో మట్టి మనుషుల జీవితాల్ని.. ‘గంగపుత్రులు’లో సముద్రాన్ని నమ్ముకునే వారి జీవితాల్ని లోతుగా చూపించిన సునీల్.. ఇప్పుడు పొట్ట కూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ దుర్భరమైన జీవితాలు గడిపే పేదల గురించి ‘గల్ఫ్’లో చూపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని యక్కలి రవీంద్ర బాబు.. ఎం.ఎం.రామ్ కుమార్ నిర్మించారు. ‘రోజులు మారాయి’ ఫేమ్ చేతన్ ఇందులో హీరోగా నటించాడు.