‘గల్ఫ్’ సినిమాను 50 లక్షలమంది చూస్తారట

Update: 2017-10-11 11:31 GMT
ఈ శుక్రవారం అక్కినేని నాగార్జున సినిమా ‘రాజు గారి గది-2’ మంచి అంచనాల మధ్య పెద్ద స్థాయిలోనే రిలీజవుతోంది. ఐతే దీనికి పోటీగా సీనియర్ దర్శకుడు సునీల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా ‘గల్ఫ్’ను కూడా రిలీజ్ చేస్తున్నారు. ఐతే ఏ ధైర్యంతో ఈ సినిమాను ఓ పెద్ద సినిమాకు పోటీగా రిలీజ్ చేస్తున్నారని సునీల్ కుమార్ రెడ్డిని అడిగితే ఆయన సమాధానం చెప్పారు.

‘‘మన తెలుగు వారిలో 50 లక్షల మందికి గల్ఫ్ దేశాలంటే ఏమిటో.. అక్కడుండే మన వాళ్ల కష్టాలేంటో బాగా తెలుసు. ఇది వాళ్ల సినిమానే. వాళ్లందరూ ఈ సినిమా చూసినా చాలు.. కమర్షియల్ గా సక్సెస్ అవుతుంది. వాళ్లందరూ ఈ సినిమాను చూస్తారని నమ్ముతున్నా. అలాగే ఈ సినిమాలో మంచి ప్రేమకథ కూడా ఉంది. దాన్ని మించిన కమర్షియల్ పాయింట్ ఏముంటుంది? కమర్షియల్ అంశాలు కోరుకునే వాళ్లు కూడా టికెట్ డబ్బుకు సరిపడా వినోదాన్ని పొందుతారు’’ అని అన్నారు.

మరి ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఎదురవలేదా అని అడిగితే.. ‘‘ఇండస్ట్రీలో.. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ లో నాకున్న పరిచయాలతో విడుదలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకున్నాను. మా సినిమాకు 250-300 మధ్య థియేటర్లలో రిలీజవుతుంది. మంచి విషయం.. ఎమోషన్.. ఫీల్ ఉన్న సినిమా కావడంతో ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్ముతున్నా’’ అని సునీల్ కుమార్ రెడ్డి చెప్పారు.
Tags:    

Similar News