మెగా మూవీకి సునీల్‌ ను ఒప్పించే ప్రయత్నం

Update: 2019-03-11 08:10 GMT
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం రెండు సినిమాలను లైన్‌ లో పెట్టాడు. మొదటిది హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న 'వాల్మీకి' సినిమా కాగా, రెండవది అల్లు అర్జున్‌ అన్న అల్లు వెంకటేష్‌ నిర్మించబోతున్న మూవీ. ఈ రెండవ సినిమాతో కిరణ్‌ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. బాక్సింగ్‌ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఈ చిత్రం కోసం వరుణ్‌ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. బాక్సింగ్‌ లో మెలకువల కోసం ఒలింపిక్స్‌ పతక విజేత టోనీ వద్ద వరుణ్‌ తేజ్‌ ట్రైనింగ్‌ తీసుకున్న విషయం తెల్సిందే.

ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర కోసం సునీల్‌ ను ఎంపిక చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ లో ఒకప్పుడు స్టార్‌ హీరో కమ్‌ నటుడు అయిన సునీల్‌ శెట్టి గత కొంత కాలంగా చాలా అరుదుగా సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలోని ఒక పాత్రకు సునీల్‌ శెట్టి అయితే బాగా సూట్‌ అవుతాడనే ఉద్దేశ్యంతో ఆ పాత్రను ఆయనతో చేయించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం బాలీవుడ్‌ సునీల్‌ తో చర్చలు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన వినయ విధేయ రామ చిత్రంలో బాలీవుడ్‌ ఒకప్పటి స్టార్‌ హీరో వివేక్‌ ఒబేరాయ్‌ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సిందే. ఇప్పుడు వరుణ్‌ మూవీ కోసం మరో బాలీవుడ్‌ నటుడు అయిన సునీల్‌ శెట్టిని రంగంలోకి దించబోతున్నారు. గతంతో పోల్చితే ఈమద్య కాలంలో బాలీవుడ్‌ స్టార్స్‌ సౌత్‌ లో ముఖ్యంగా తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకే వరుణ్‌ తేజ్‌ మూవీలో కూడా సునీల్‌ శెట్టి నటించే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Tags:    

Similar News