ఒక సిగరెట్ సన్నీతో శోభనం మిస్ చేసింది

Update: 2016-02-24 03:38 GMT
సన్నీ లియోన్ తో ఎలాంటి సినిమాలు తీయచ్చు.. ఇప్పటివరకూ ఈ పోర్న్ స్టార్ తో తీసిన మూవీస్ అన్నీ ఒకెత్తు అయితే.. ఈ 11 మినిట్స్ పేరుతో తీసిన షార్ట్ ఫిలిం ఒకటీ ఒకెత్తు అనాలి. సన్నీ స్టైల్ లోనే ఓ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ తో తీసిన ఈ ఫిలిం తెగ ఆకట్టుకుంటోంది.

అనగనగా ఓ పల్లెటూరు. అక్కడ చనిపోవడానికి సిద్ధంగా మంచం పై పడి ఉన్న వ్యక్తి. తన ఆఖరి కోరికగా సన్నీ లియోన్ కావాలంటాడు. కుటుంబ సభ్యులు కూడా ఎలాగోలా సన్నీని ఒప్పించి.. ఆ భామతో ఫస్ట్ నైట్ (లాస్ట్ విష్ కాబట్టి లాస్ట్ నైట్ కూడా అనుకోవచ్చు) ఏర్పాటు చేస్తారు. సన్నీ కూడా తను ఎందుకొచ్చిందో.. ఆ పని చేసేందుకు సిద్ధమవుతుంది. ఒంటిపై ఉన్న డ్రస్ - ఆర్నమెంట్స్ ను ఒక్కొక్కటిగా తీస్తూ ఉంటుంది. ఈ లోగానే ఆ చైన్ స్మోకర్ అయిన పేషెంట్ చనిపోతాడు. ఇదీ ఆ మెసేజ్ ఓరియెంటెడ్ షార్ట్ ఫిలిం కథ.

మరి కాసేపు బతికుంటే తన ఆఖరి కోరిక తీర్చుకునే వాడు. కానీ ఒకో సిగరెట్ ఖరీదు 11 నిమిషాల ఆయుష్షు. సిగరెట్ చాలా ప్రమాదమైనది. మీ ఆఖరి కోరికను కూడా అది కబళించే ఛాన్స్ ఉంది అంటూ చివర్లో మెసేజ్. చూసినవాళ్లు ఎవరైనా సరే లేచి నుంచుని చప్పట్లు కొట్టాల్సిందే. ఇప్పటి వరకూ సన్నీ లియోన్ ని సెక్స్ మూవీస్ కి, అడల్ట్ కంటెంట్ కి మాత్రమే వాడుకున్న వాళ్లకి.. ఈ షార్ట్ ఫిలిం చక్కని మెసేజ్. ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ లో యాక్ట్ చేసిన సన్నీలియోన్ కి  హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే మెసేజ్ ఉన్నా.. అది చెప్పిన విధానం కొంచెం అభ్యంతరకరంగా ఉందనే కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తున్నాయి.
Full View

Tags:    

Similar News