ప్రపంచం వ్యాప్తంగా ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవిస్తున్నాయి. ప్రతి చోట కూడా విభిన్నమైన మార్గంలో ఆదాయ వనరులు మరియు మార్గాలు ఏర్పడుతున్నాయి. అందులో భాగంగానే పుట్టుకు వచ్చింది ఎన్.ఎఫ్.టి (Non fungible token). ఇది పూర్తిగా డిజిటల్ ఆధారిత బిజినెస్. దీనిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవ్వచ్చు. బారతీయ ప్రముఖ ఫిల్మ్ స్టార్స్ అయిన బిగ్ బి అమితాబచ్చన్.. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ లు జాయిన్ అయ్యారు. క్రిప్టో కరెన్సీని ప్రోత్సహించడంలో భాగంగా ఈ వ్యాపారం సాగుతుంది అనేది విశ్లేషకుల వాదన.
ఈ బిజినెస్ లో భాగంగా సెలబ్రెటీల ఆటలు.. పాటలు.. ఫొటోలు.. వీడియోలు.. వారికి సంబంధించిన ప్రతి విషయాలు కూడా డిజిటల్ ఫార్మట్ లో ఆస్తులుగా అందుబాటులో ఉంటాయి. వాటిని ఏ ఒక్కరైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని కొనుగోలు చేసిన వారు ఎక్కువ మొత్తంకు అయినా లేదా తక్కువ మొత్తంకు అయినా అంతే మొత్తానికైనా దాన్ని తిరిగి అమ్మకానికి పెట్టే వెసులుబాటు ఉంటుంది. అలా మార్చి మార్చి సెలబ్రెటీల డిజిటల్ ఇన్ఫర్మేషన్ వేలం ద్వారా అటు ఇటుగా మారుతూనే ఉంటుంది. ఈ వేలంలో వచ్చిన మొత్తంలో 10 శాతం ఎన్ ఎఫ్ టీ నిర్వాహకులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ బిజినెస్ లోకి సన్నీలియోన్ జాయిన్ అవుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
ఇప్పటి వరకు ఈ ఎన్ ఎఫ్ టి డిజిటల్ మార్కెట్ లోకి కేవలం స్టార్ హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. భారత చలన చిత్ర రంగానికి చెందిన హీరోయిన్స్ కాని.. ఏ నటి కాని అడుగు పెట్టలేదు. మొదటగా సన్నీలియోన్ ఈ బిజనెస్ లో అడుగు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. మిస్ ఫిట్జ్ పేరుతో తన ఎన్ ఎఫ్ టి అకౌంట్ ను క్రియేట్ చేసినట్లుగా చెప్పింది. మిస్ ఫిట్జ్ కు పింక్ రంగు అంటే ఇష్టం.. టాటూలు వేయించుకున్న వారు అంటే ఇష్టం.. ఎప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉండే ఆమె గురించి మరింతగా తెలుసుకునేందుకు వచ్చేయండి అంటూ తన అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఎన్ ఎఫ్ టి కి ఆహ్వానించింది. ముందు ముందు మొత్తం సెలబ్రెటీలు అంతా కూడా ఈ ఎన్ ఎఫ్ టి లో అడుగు పెట్టడం.. విప్లవాత్మక డిజిటల్ మార్పు రావడం ఖాయం అంటున్నారు.