టాలీవుడ్ ఈ నెల చాలా డ్రైగా సాగుతోంది. చెప్పుకోదగ్గ సినిమా లేక మూవీ లవర్స్ పరిస్థితి చెప్పనలవిగా ఉంది. అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని సామెత తరహాలో ప్రతి గురు శుక్రవారాలు సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ ఏదీ కనీస అంచనాలను సైతం అందుకోలేక పోవడం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో మంత్ ఎండింగ్ లో వస్తున్న యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కల్కి మీద అంచనాలు పెరుగుతున్నాయి.
అ! లాంటి విభిన్నమైన కాన్సెప్ట్ తో విమర్శకులను సైతం మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ పాతికేళ్ల క్రితం జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నాడు. ఇప్పటికే టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తి రేపగా సినిమాలో థీమ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని టాప్ స్టాండర్డ్ లో ఉండటం సహజంగానే హైప్ పెంచుతోందిఇప్పుడీ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే జులై మొదటి రెండు వారాలను కల్కి తన కంట్రోల్ లో తీసుకోవచ్చు.
రెగ్యులర్ కమర్షియల్ జానర్ కాదు కాబట్టి కంటెంట్ కనక మెప్పించేలా ఉంటె ఓపెనింగ్స్ తో పాటు స్టడీ రన్ దక్కుతుంది. కృష్ణా - గుంటూరు జిల్లాలో 1985లో జరిగిన వరుస హత్యలను ఇన్వెస్టిగేట్ చేసే పాత్రలో రాజశేఖర్ కనిపించబోతున్నాడు. అంతు చిక్కని రీతిలో జరిగిన ఆ దారుణాల పద్మవ్యూహం ఛేదించే క్రమంలో తనే ప్రమాదంలో పడతాడు. అసలు కల్కి ఎవరు అన్ని దుర్మార్గాలు చేస్తోంది ఎవరు లాంటి ప్రశ్నలకు సమాధానం కల్కీనే చెప్పాలి. ఇప్పుడున్న బజ్ ని నిలబెట్టుకుంటే గరుడవేగాని మించిన సక్సెస్ రాజశేఖర్ ఖాతాలో పడ్డట్టే